దేవుళ్ల‌కు మొక్కుతున్న సామ్‌

Last Updated on by

అందాల స‌మంత త‌న సినిమాల‌కు తాను ప్ర‌మోష‌న్ చేసుకోవ‌డం త‌ప్ప వేరే వాళ్ల‌ సినిమాల‌కు ప‌బ్లిసిటీ చేసేది త‌క్కువే. ఎందుకంటే ఓవైపు న‌టిగా బిజీ. మ‌రోవైపు నిర్మాత‌గానూ బిజీ బిజీ. యూట‌ర్న్ రీమేక్‌తో పాటు, ప‌లు చిత్రాల్లో న‌టిస్తోందిపుడు. ఇంత బిజీలోనూ ఓ వ్య‌క్తి కోసం సామ్ పనిగ‌ట్టుకుని ప్ర‌చారం చేస్తోంది. అత‌డు ఎవ‌రు అంటే సుశాంత్ అని చెబితే త‌ప్పులో కాలేసిన‌ట్టే. చి.ల‌.సౌ చిత్రానికి సమంత‌ ప్ర‌చారం చేయ‌డానికి కార‌ణాలు పూర్తిగా వేరే.

అక్కినేని కాంపౌండ్ హీరో క‌దా అని సుశాంత్‌కి ప్ర‌చారం చేసేందుకు కోడ‌లు సామ్ సిద్ధంగా లేనేలేదు. త‌న ప్ర‌చారం అంతా ద‌ర్శ‌కుడు కాబోతున్న స్నేహితుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ కోసం మాత్ర‌మే. అత‌డిని ఎట్టి ప‌రిస్థితిలో ద‌ర్శ‌కుడిగా చూడాల‌ని సామ్ భావిస్తోందిట‌. అందుకే త‌న‌వంతుగా ఇలా ప్ర‌చార సాయం చేస్తోంది. సుశాంత్ సినిమాని వేరెవ‌రో నిర్మిస్తే ఉన్న‌ట్టుండి అన్న పూర్ణ బ్యాన‌ర్‌ని ఎటాచ్ చేసి సామ్‌- చైత‌న్య‌ ప్ర‌చారం చేయ‌డం వెన‌క కార‌ణం కూడా స్నేహం అనే కాన్సెప్టు మాత్ర‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది. త‌న కెరీర్ స్టార్టింగ్ డేస్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ రాహుల్ ర‌వీంద్ర కూడా త‌న వెంటే ఉన్నాడు. అత‌డి వైఫ్ చిన్మ‌యి కూడా త‌న‌కు పెద్ద అండ‌గా నిలిచింది. అందుకే ఆ జంట రుణం తీర్చుకునేందుకే ఇంత‌గా ప్ర‌చారం చేస్తోంది. ఎంత‌గా అంటే రాహుల్ ద‌ర్శ‌కుడు కావాల‌ని ఎంద‌రో దేవుళ్ల‌కు అదే ప‌నిగా మొక్కిందిట‌.

User Comments