బాబోయ్ వర్మ వద్దు.. సమంత ముద్దు

Last Updated on by

ఇప్పుడు స‌మంత అంటే కేవ‌లం హీరోయిన్ మాత్ర‌మే కాదు.. అక్కినేని వంశానికి కోడ‌లు కూడా. ఆమెకు కూడా ఇప్పుడు ఓ పెద్ద కుటుంబం ఉంది. వాళ్ల బాధ్య‌త కూడా తీసుకుంది స‌మంత‌. త‌న బాధ్య‌త‌ను గుర్తు పెట్టుకుని త‌న వాళ్ల‌కు సాయం చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్పుడు నాగార్జున‌కు కూడా స‌మంత సాయం కావాల్సి వ‌చ్చింది. కోడ‌లి సాయంతోనే కొత్త సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చూస్తున్నాడు ఈ హీరో. ఈ మ‌ధ్యే అఖిల్ హ‌లో సినిమాకు కూడా కావాల్సినంత ప్ర‌మోష‌న్ చేసింది స్యామ్. అప్పుడు మ‌రిది కోసం ముందుకొచ్చిన స‌మంత‌.. ఇప్పుడు మామ కోసం ముందుకొస్తుంది.

నాగ్ న‌టిస్తున్న ఆఫీస‌ర్ సినిమాకు స‌మంత ప్ర‌మోష‌న్ చేయ‌నుంది. దీనికి కూడా కార‌ణం లేక‌పోలేదు. దీనికి ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఇప్పుడు మ‌నోడిపై తెలుగు ఇండ‌స్ట్రీ ప‌గ ప‌ట్టింది. దాంతో వ‌ర్మ వ‌చ్చి ఇప్పుడు ప్ర‌మోష‌న్ చేసినా సినిమాకు నెగిటివ్ అవుతుందే కానీ పాజిటివ్ మాత్రం కాదు. అందుకే కోడ‌ల్ని రంగంలోకి దింపుతున్నాడు నాగార్జున‌. మామ కోసం స‌మంత కూడా వ‌చ్చేస్తుంది. మే 25న ఆఫీస‌ర్ విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం త‌న సినిమాల‌ను కూడా ప‌క్క‌న‌బెట్టి మామ కోసం ప్ర‌మోష‌న్ కు సిద్ధ‌మ‌వుతుంది స‌మంత‌. మొత్తానికి అక్కినేని కోడ‌లి ప‌క్కాగా నిర్వ‌ర్తిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌.

User Comments