వ్వావ్‌! సామ్ కిక్కిచ్చే డెసిష‌న్‌!!

Last Updated on by

హ్యాట్రిక్ విజ‌యాల‌తో సామ్‌లో దూకుడు పెరిగింద‌ని చెబుతున్నారు. 2017లో అన్నీ స‌క్సెస్‌లే. గ‌త ఏడాది `రాజుగారి గ‌ది2`, `మెర్స‌ల్`(అదిరింది) బంప‌ర్ హిట్లు కొట్టాయి. 2018లోనూ వ‌రుస విజ‌యాల్ని ఖాతాలో వేసుకుంటోంది. ఇప్ప‌టికే `రంగ‌స్థ‌లం`, `మ‌హాన‌టి` చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధించాయి. ఈ రెండు సినిమాల్లో స‌మంత న‌ట‌న‌కు అవార్డులు రివార్డులు ఆశిస్తున్నారు. `రంగ‌స్థ‌లం`లో రామ‌ల‌క్ష్మిగా, `మ‌హాన‌టి`లో జ‌ర్న‌లిస్టు మ‌ధుర‌వాణిగా అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న స‌మంత‌కు జాతీయ అవార్డు వ‌స్తుంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి.

అదంతా స‌రే.. సామ్ ఈ కిక్‌లోనే మ‌రో కిక్కిచ్చే నిర్ణ‌యం తీసుకుందిట‌. నిర్మాత‌ల గుండు ప‌గిలేలా అందాల స‌మంత త‌న రెమ్యున‌రేష‌న్‌ను డ‌బుల్ చేసింద‌ని తెలుస్తోంది. ఇన్నాళ్లు కోటిన్న‌ర నుంచి 2కోట్ల వ‌ర‌కూ సామ్ డిమాండ్ చేసేది. ఇప్పుడు అది అమాంతం పెరుగుతోంద‌ని స‌మాచారం. ఎప్ప‌టికెయ్య‌ది.. అప్ప‌టికి ఆ మాట‌లాడ‌..! అన్న చందంగా.. అప్ప‌టి ప‌రిస్థితిని, స‌న్నివేశాన్ని బ‌ట్టి క‌థానాయిక‌లు పారితోషికం పెంచేయ‌డం, త‌గ్గించ‌డం చేస్తుంటారు. ఇదివ‌ర‌కూ పెళ్లికి రెడీ అవుతున్న వేళ .. కెరీర్ డౌన్‌ఫాల్ అవ్వ‌కూడ‌ద‌ని తెలివిగా పారితోషికం త‌గ్గించుకుని సినిమాలు అంగీక‌రించిన సామ్‌.. ప్ర‌స్తుత స‌క్సెస్ ట్రాక్ దృష్ట్యా పెరిగిన డిమాండ్‌ను ఎన్‌క్యాష్ చేసుకునే దిశ‌గా ఆలోచిస్తోందిట‌. ఇదే ఊపులో త‌న‌ని సంప్ర‌దించే నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపించే ప్లాన్‌లో ఉంద‌ని చెబుతున్నారు. స‌మంత ఇప్ప‌టికిప్పుడు ప‌లు క్రేజీ సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఇటు తెలుగు, అటు త‌మిళం ద్విభాషా చిత్రాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ, చైతో క‌లిసి జోడీగా న‌టించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. వామ్మోవ్‌! సామ్‌.. కిక్కిచ్చే ఈ డెసిష‌న్ ఏంట‌మ్మా?

User Comments