పూర్వ జ‌న్మ‌లో స‌మంత ఇలా!

Last Updated on by

పూర్వ జ‌న్మ‌లో స‌మంత ఎలా ఉండేది? అస‌లు అప్పుడు కూడా ఇప్ప‌టిలానే సినిమా స్టారేనా? ఇలాంటి సందేహాలేవైనా ఉన్నాయా? ఉంటే గింటే ఇదిగో ఈ ఫోటో చూడాలి. వైట్ & వైట్ టాప్ టు బాట‌మ్ ఆ లుక్కేంటో.. ఆ టాప్ కి బ్లాక్ క‌ల‌ర్ టీస్ మిక్సింగ్ ఏంటో.. బాట‌మ్‌లో ఆ బెల్ ప్యాంటు ఏంటో.. అబ్బ‌బ్బ! 1970లో రిచ్ గాళ్స్‌.. జ‌మీందారీ ఫ్యామిలీలో గారాల పాపాయిలు ఇలానే ఉండేవారా? అని సందేహం కల‌గ‌క మాన‌దు.

https://www.instagram.com/p/Bid5Y6AnYnM/?hl=en

అస‌లు ఈ లుక్ ఏ సినిమాలోనిది? అంటే నిస్సందేహంగా `మ‌హాన‌టి`లోనిదే. ఈ సినిమా కోసం స‌మంత లుక్ టెస్ట్ చేసిన‌ప్పుడు ఇలా ఈ డిజైన‌ర్‌వేర్ ధ‌రించిన సామ్ భ‌లేగా స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. మ‌హాన‌టి చిత్రంలో జ‌ర్న‌లిస్టు వేష‌ధార‌ణ మ‌హ‌దాద్భుతంగా క‌న్నుల పండువ చేయ‌బోతోంది అనేందుకు ఈ ఫోటోనే ప్ర‌త్య‌క్ష సాక్ష్యం. పూర్వ జ‌న్మ కాదు కానీ, వ‌ర్త‌మానంలో .. అదీ 70ల‌లో అలా ఉండేది సామ్‌! హౌస్ ఆఫ్ఎదా.. స్టైలింగ్ ఇది.. జుక‌ల్క‌ర్‌-హారిక మేక‌ప్ తీర్చిదిద్దారు. నెల్లూరు లాక్మే సెలూన్ ఓపెనింగు వేళ‌ ఇలా రెడీ అయ్యాన‌ని సామ్ హింటిచ్చింది.

User Comments