స‌మంత రూటే స‌ప‌రేటు

Last Updated on by

పెళ్లి త‌ర‌వాత రెయిజింగ్ హీరోయిన్లుగా ఎదిగిన భామ‌లెంద‌రో. టాలీవుడ్ వ‌ర‌కూ ప‌రిశీలిస్తే జెమిని గ‌ణేష‌న్‌ని పెళ్లాడిన సావిత్రి కెరీర్ అనూహ్యంగా పెళ్లి త‌ర‌వాతే రెయిజ్ అయ్యింది. ఆ కోవ‌లో పెళ్లి త‌ర‌వాత సౌత్ సినీప‌రిశ్ర‌మ‌లో పెద్ద స్థాయికి ఎదిగిన వాళ్లు త‌క్కువే కానీ, అదే బాలీవుడ్, హాలీవుడ్‌లో అయితే అక్క‌డ వివాహానంత‌రం రాణించిన క‌థానాయిక‌లెంద‌రో ఉన్నారు. హేమ‌మాలిని, మ‌హి గిల్‌, చిత్రాంగ‌ద సింగ్‌, రాధిక ఆప్టే వంటి తార‌లు బాలీవుడ్‌లో వివాహానంత‌రం ఎదిగిన తారలు. ఆ త‌ర‌వాత అదితీరావ్ హైద‌రీ సీక్రెట్‌గా పెళ్లాడి, అటుపై ఆ బంధానికి బ్రేక‌ప్ చెప్పి క‌థానాయిక‌గా కెరీర్ సాగిస్తోంద‌న్న ప్ర‌చారం ఉంది. వీళ్లంతా పెళ్లి త‌ర్వాతా రాణించిన క‌థానాయిక‌లు. అటు హాలీవుడ్‌లో మ‌ర్లిన్ మ‌న్రో సైతం పెళ్లి త‌ర్వాత కూడా క‌థానాయిక‌గా రాణించారు. స్టైల్‌, అందానికి చిరునామాగా కొన‌సాగిన మ‌ర్లిన్ ఆరంభం మోడ‌ల్‌. ఆ త‌ర‌వాత సినీనాయిక‌గా ఆరంగేట్రం చేసి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించారు. పెళ్లి త‌ర్వాత కూడా అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న నాయిక‌గా వెలిగిపోయారు.

వీళ్లంద‌రికీ భిన్నంగా అందాల క‌థానాయిక స‌మంత భ‌ర్త నాగ‌చైత‌న్య‌ స‌పోర్టుతో స్టార్‌డ‌మ్‌ని అంత‌కంత‌కు పెంచుకుంటూ పోతోంది. ఓ ర‌కంగా చెప్పాలంటే పెళ్లి త‌ర‌వాత హ్యాపీయెస్ట్ హీరోయిన్‌గా స‌మంత పేరు చెప్పుకోవ‌చ్చు. అక్కినేని కోడ‌లు, నాగ‌చైత‌న్య భార్య ఇమేజ్‌తో ఎలాంటి అడ్డంకి లేకుండా కెరీర్ ప‌రంగా మ‌రో మెట్టు ఎక్క‌డంలో స‌మంత స‌క్సెసైంది. ఇటీవ‌లే హ్యాట్రిక్ విజ‌యాలు అందుకుని వ‌రుస‌గా సినిమాల‌కు సంత‌కాలు చేస్తోంది. ఇప్ప‌టికే క‌న్న‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్ `యూట‌ర్న్‌` రీమేక్‌లో న‌టిస్తోంది. ఈ సినిమా నాయికా ప్ర‌ధాన క‌థాంశంతో ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంద‌ని తెలుస్తోంది. ఇక‌పోతే `యూ టర్న్` స్ఫూర్తితోనే స‌మంత మ‌రో నాయికా ప్ర‌ధాన చిత్రానికి సంత‌కం చేసింద‌ని తెలుస్తోంది. ఈ చిత్రానికి అర్జున్‌రెడ్డి ఫేం సందీప్‌రెడ్డి వంగ శిష్యుడు గిరీస‌య్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ట‌. ఆగ‌ష్టులో చిత్రీక‌ర‌ణ‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. స‌మంత వ‌రుస‌ చూస్తుంటే ఇక‌పై గ్లామ‌ర‌స్ పాత్ర‌ల కంటే, నాయికా ప్ర‌ధాన పాత్ర‌ల‌కే ప్రాధాన్య‌త‌నివ్వ‌నుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

User Comments