పిక్ టాక్‌: చ‌ంద‌మామే తుళ్లిప‌డేలా

Last Updated on by

అందాల జెస్సీ.. అక్కినేని బుల్లోడు వ‌ల‌చిన సౌంద‌ర్య రాశి స‌మంత న‌వ్వితే ఎలా ఉంటుంది? చంద‌మామ మూగ‌వోయి అలా మైమ‌రిచి చూస్తూ ఉండిపోదూ.. ? ఇదిగో ఈ న‌వ్వు చూశాక ఆ మాట అన‌కుండా ఉండ‌గ‌ల‌మా? ఎంతో ఆహ్లాద‌క‌ర‌మైన న‌వ్వుతో స‌మంత ఇలా ద‌ర్శ‌న‌మిచ్చింది.

కాస్త ప‌రిశీల‌న‌గా చూస్తే .. 1970ల‌లో ఇందిర‌మ్మ‌ను త‌ల‌పిస్తోంది. ఆ డిజైన‌ర్ చేనేత చీర .. మోచేతి వ‌ర‌కూ క‌వ‌ర్ చేసిన పింకు రంగు టాప్ .. చేతివేళ్ల‌కు సింపుల్‌గా ఉంగ‌రాలు.. చెవి జూకాలు.. ఇదంతా చూస్తుంటే భవిష్య‌త్ రాజ‌కీయ నేత‌ను గుర్తు చేస్తోంది. అన్న‌ట్టు తేరాస మంత్రి, తెలంగాణ రాకుమారుడు కేటీఆర్ ఇదివ‌ర‌కూ స‌మంత‌ను రాజ‌కీయాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానించార‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో సామ్ పోటీ చేస్తుంద‌ని చెప్పుకున్నారు. ఇంత‌కీ 2019 జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్‌లో సామ్ పోటీ చేస్తుందా .. లేదా?

User Comments