ఈసారి అల్ట్రామోడ్ర‌న్ జ‌ర్న‌లిస్ట్

Last Updated on by

జ‌ర్న‌లిస్టు మ‌ధుర‌వాణిగా అందాల స‌మంత న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా గుర్తు చేయాల్సిన ప‌నేలేదు. మ‌హాన‌టి చిత్రంలో టైటిల్ పాత్ర‌ధారి కీర్తి సురేష్‌కి ఎంత మంచి పేరొచ్చిందో, అంత గొప్ప పేరు స‌మంత‌కు వ‌చ్చింది. లెజెండ‌రీ న‌టి సావిత్రి జీవితంపై ప‌రిశోధ‌న సాగించే ఓ పాత‌కాలం మ‌హిళా జ‌ర్న‌లిస్టుగా సామ్ అచ్చుగుద్దిన‌ట్టు న‌టించ‌డంలో స‌క్సెసైంది.  జ‌ర్న‌లిస్ట్ మ‌ధుర‌వాణి అన్న పేరుకు త‌గ్గ‌ట్టే న‌త్తి న‌త్తిగా మాట్లాడుతూ ఎడిట‌ర్ ముందు పిరికి అమ్మాయిగా గొప్ప అభిన‌యం క‌న‌బ‌రిచింది. అమాయ‌కంగా క‌నిపిస్తూ చివ‌రికి ప్రేమించిన వాడికోసం తండ్రినే ఎదిరించే రెబ‌ల్ గాళ్ గానూ సామ్ అభిన‌యం కుర్ర‌కారు గుండెల్ని హ‌త్తుకుంది.
మ‌హాన‌టిని గెలిపించిన జ‌ర్న‌లిస్టు మ‌ధుర‌వాణి ప్ర‌స్తుతం ఏం చేస్తోంది? అంటే ఇవిగో ఈ ఫోటోలే అందుకు స‌మాధానం. స‌మంత ప్ర‌స్తుతం స్వ‌యంగా న‌టిస్తూ, నిర్మిస్తున్న `యూటర్న్‌` ఆన్‌సెట్స్ ఉంది. ఇటీవ‌లే టైమ్స్ ఆఫ్ ఇండియా ప‌త్రిక ఆఫీస్‌లో స‌మంత‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కించారు. మ‌హాన‌టిలో పాత కాలం ప‌క్క‌పాపిడి పాపాయ‌మ్మ‌గా క‌నిపించిన సామ్‌.. ఈసారి మాత్రం పొట్టి హెయిర్‌తో అల్ట్రా మోడ్ర‌న్ జ‌ర్న‌లిస్టుగా క‌నిపిస్తోంది. ముక్కుకు ముక్కెర… తీక్ష‌ణ‌మైన చూపులు అద‌న‌పు బోన‌స్‌గా క‌నిపిస్తున్నాయ్‌.

User Comments