రాజ‌కీయాల్లోకి స‌మంత‌?

Last Updated on by

అక్కినేని కోడ‌లు స‌మంత రాజ‌కీయాల్లోకి వెళుతున్నారా? అంటే అవుననే ప్ర‌చారం సాగుతోంది. అయితే సామ్ రాజ‌కీయాలు అన‌గానే క‌న్ఫ్యూజ్ అవ్వాల్సిన ప‌నేలేదు. త‌న‌కు రాజ‌కీయాలు తెలీదు. రాజ‌కీయ నాయ‌కురాలి పాత్ర‌లో న‌టించ‌డం మాత్రం తెలుసు. అందుకే ప్ర‌స్తుతం ఓ డెబ్యూ ద‌ర్శ‌కుడు చెప్పిన పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ క‌థ విని ఆ సినిమాకి సంత‌కం చేసేందుకు రెడీ అవుతోంద‌ని తెలుస్తోంది. విజ‌య్ సేతుప‌తి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి దిల్లీ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. తుగ్ల‌క్ ద‌ర్బార్ అనే టైటిల్ వినిపిస్తోంది.

అయితే స‌మంత ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్టుల‌తో బిజీ. నాగ‌చైత‌న్య‌తో క‌లిసి మ‌జిలీ అనే చిత్రంలో న‌టిస్తోంది. ఈ స‌మ్మ‌ర్ లో ఈ చిత్రం రిలీజవుతోంది. ఆ త‌ర్వాత మిస్ గ్రానీ అనే కొరియ‌న్ మూవీ రీమేక్ లో న‌టించ‌నుంది. ఈ చిత్రంలో 60 ఏళ్ల వృద్ధురాలిగా, అంద‌మైన యువ‌తిగా ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతోంది. ఆ త‌ర్వాత తుగ్ల‌క్ ద‌ర్బార్ లో న‌టించే వీలుంటుంది. ఇప్ప‌టికే సామ్ విజ‌య్ సేతుప‌తి స‌ర‌స‌న వేరొక త‌మిళ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అందుకే వెంట‌నే మ‌రో చిత్రానికి ఓకే చేస్తే తెలుగులోనూ మార్కెట్ కి క‌లిసొస్తుంద‌నేది ప్లాన్. ప్ర‌స్తుతానికి రాజ‌కీయాల‌కు ఆస్కారం లేదు. రాజ‌కీయ నాయ‌కురాలిగానో లేక రాజ‌కీయాలు చేసే పాత్ర‌లోనో నటించ‌నుంద‌న్న‌మాట‌.

User Comments