స్నేహితులతో కలిసి సమంత పెట్టిన కంపెనీ..?

చెన్నై చిన్నది సమంత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నుంచి తెలుగింటి కోడలిగా కూడా ప్రమోషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈలోపు చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడానికి బిజీబిజీగా తిరిగేస్తున్న సమంత.. మధ్యలో తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన వొవెన్ 2017 కార్యక్రమం కోసం ప్రమోషన్స్ కూడా చేస్తూ, చేనేతకు అండగా నిలుస్తూ తన గొప్ప మనస్సును చాటుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత బిజీగా ఉండి కూడా సమంత బిజినెస్ రంగం వైపు కూడా అడుగులు వేస్తున్నట్లు తెలియడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది.
ఈ మేరకు తాజా ఇన్నర్ టాక్ ప్రకారం తెలుస్తుందేమిటంటే, సమంత తన ప్రాణ స్నేహితులతో కలిసి సొంతంగా ఓ కంపెనీ స్టార్ట్ చేసిందట. ‘SVS partners LLP’ అనే పేరుతో పిలవబడుతున్న ఈ కంపెనీని సమంత తన ఫ్రెండ్స్ వాణి, శ్రీరామ్, వంశీ మేఘన లతో కలిసి ప్రారంభించిందని తాజా సమాచారం. అయితే,  ఇప్పుడు సమంత అండ్ ఫ్రెండ్స్ ఈ కంపెనీతో ఏం చేస్తారనేదే ఇన్నర్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా ఓవైపు ఇది కంపెనీ కాదని, చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెట్టడానికి సమంత తన స్నేహితులతో కలిసి కొత్తగా నెలకొల్పిన బ్యానర్ అని గట్టిగానే ప్రచారం జరుగుతోంది.
అంతేకాకుండా తనకు నచ్చిన కథలను తక్కువ బడ్జెట్ లో సినిమాలుగా మలచడానికి సమంత ఉత్సాహంగా ఉందని అంటున్నారు. మరోవైపు, ఈ కంపెనీతో హ్యాండ్ లూమ్స్ కు సంబంధించి ఏదో చేయబోతున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది. మొత్తానికి ఈ కంపెనీ కోసం ఎన్నో కలలు కన్నానని చెప్పిన సమంత.. వాటిని త్వరలోనే సాకారం చేసుకుంటానని కూడా పేర్కొంది. దీన్ని బట్టి ఈ కంపెనీ పేరు చెప్పి ఇటు హ్యాండ్ లూమ్స్ తో పాటు సినిమాలు నిర్మించడమే కాకుండా ఇంకా ఎన్నో చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదేమో. మరి ఇంత బిజీ టైమ్ లో కూడా ఇలాంటి స్టెప్ తీసుకున్న టాలెంటెడ్ సమంత తన ఫ్యూచర్ ప్లానింగ్స్ తో ఇంకెన్ని షాక్ లు ఇస్తుందో చూడాలి.