ఆగ‌స్టు 17న దండ‌యాత్ర‌

Last Updated on by

స‌మంత క‌థానాయిక‌గా న‌టిస్తూ నిర్మించిన `యూట‌ర్న్` సెప్టెంబ‌ర్ 13న రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో వేగం పెంచేందుకు సామ్ ట‌ర్న్ తీసుకుంది. ఆగ‌స్టు 17న తొలి ట్రైల‌ర్ రిలీజ‌వుతోంది. ఆ మేర‌కు ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేసింది స‌మంత‌.

ఈనెల 17న యూట‌ర్న్ ట్రైల‌ర్ లాంచ్ చేస్తున్నాం. సీటు అంచుపై కూచుని స్ట‌న్న‌యిపోయే థ్రిల్ల‌ర్ ఇది. గ‌య్స్ అంతా ఎగ్జ‌యిట్ అయిపోవ‌డం ఖాయం. మాతో కూచుని ట్రైల‌ర్ చూసే అవ‌కాశం కొంద‌రికే ద‌క్కింది“ అంటూ ట్విట్ట‌ర్‌లో స‌మంత షేర్ చేశారు. ఇక‌మీద‌ట యూట‌ర్న్ ప్ర‌మోష‌న్స్‌లో వేగం పెంచిన‌ట్టేన‌ని అర్థ‌మ‌వుతోంది. హార‌ర్ థ్రిల్ల‌ర్‌ల ట్రెండ్ రాజ్య‌మేలుతున్న ఈ సీజ‌న్‌లో సమంత మ‌రో హిట్ కొడుతుందేమో. ఇదివ‌ర‌కూ మామ నాగార్జున‌తో క‌లిసి `రాజుగారి గ‌ది 2` వంటి హార‌ర్ చిత్రంలో స‌మంత న‌టించింది. సెప్టెంబ‌ర్ 13న స‌మంత న‌టించిన త‌మిళ సినిమా `సీమ‌రాజా` రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.

User Comments