చెన్నై టూ హైద్రాబాద్.. స‌మంత చ‌క్క‌ర్లు..

అటు చెన్నై.. ఇటు హైద‌రాబాద్.. ఇప్పుడు రెండు న‌గ‌రాల మ‌ధ్య వార‌ధిగా ప‌ని చేస్తుంది స‌మంత‌. ఇక్క‌డ తెలుగు సినిమాలు.. అక్క‌డ త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉంది ఈ అక్కినేని కోడ‌లు. నిన్న‌టి వ‌ర‌కు ఇక్క‌డ రంగ‌స్థ‌లం సెట్ లో బిజీగా ఉన్న స‌మంత‌.. ఇప్పుడు త‌మిళ్ కి వెళ్లిపోయింది. అక్క‌డ శివ‌కార్తికేయన్ తో సినిమా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ద‌ర్శ‌కుడు పొన్ర‌మ్ తెర‌కెక్కించ‌బోయే సినిమాలో శివ‌కార్తికేయ‌న్, స‌మంత జంట‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రం కోసం చెన్నై వెళ్లింది స‌మంత‌.

Samantha Upcoming Movies list

ఈ చిత్ర టైటిల్ తో ఉన్న ఫస్ట్ లుక్ ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారు. త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్ మొద‌లు కానుంది. త‌మిళ్ లో శివ‌కార్తికేయ‌న్ సినిమాతో పాటు విశాల్ తో సినిమా చేసింది. ఈయ‌నతో జోడీక‌ట్టిన ఇరుంబు తిరై సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ఓ పాట మాత్ర‌మే బ్యాలెన్స్ ఉంది. త్వ‌ర‌లోనే స‌మంత ఈ చిత్ర షూటింగ్ లో అడుగుపెట్ట‌నుంది. మ‌రోవైపు తెలుగులో రంగ‌స్థ‌లం షూటింగ్ తో బిజీగా ఉంది. మొత్తానికి ఇటు తెలుగు.. అటు త‌మిళ సినిమాల‌తో బిజీగా కెరీర్ సాగిస్తుంది స‌మంత‌.