సుధీర్‌బాబుకు స‌మంత విరోధి

ఒకేసారి రెండు సినిమాలు రిలీజ‌వుతున్నాయంటే పోటీ అనివార్యం. ఆ రెండు సినిమాల్లో ఏ సినిమాకి క్రేజు ఎక్కువ ఉంటుందో జ‌నం ఆ థియేట‌ర్ల‌కే వెళ‌తార‌న‌డంలో సందేహం లేదు. అదే త‌ర‌హా కాంపిటీష‌న్ ఆ ఇద్ద‌రి మ‌ధ్యా షురూ అయ్యింది. అందాల స‌మంత న‌టించిన యూట‌ర్న్‌, సుధీర్ బాబు న‌టించిన `న‌న్ను దోచుకుందువ‌టే` ఒకే రోజు, అంటే సెప్టెంబ‌ర్ 13న‌ రిలీజ‌వుతూ వేడి పెంచుతున్నాయ్‌. ఆ ఇద్దరిలో విన్న‌ర్ ఎవ‌రు? అన్న మాట అటుంచితే..

ఇప్ప‌టికే సామ్ `యూట‌ర్న్` డామినేష‌న్ అన్నిచోట్లా క‌నిపిస్తోంది. స‌మంత స్వ‌యంగా నిర్మిస్తున్న హార‌ర్‌ సినిమాగా ప్ర‌మోట‌వుతోంది. ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్ ప‌రంగా సామ్ డామినేష‌న్ స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు సుధీర్‌బాబు న‌టిస్తున్న `న‌న్ను దోచుకుందువ‌టే` ప్ర‌చారంలో వేగం పెంచేందుకు సుధీర్& టీమ్‌ ప్లాన్ చేస్తున్నారు. ట్విట్ట‌ర్‌లో ఈ పోటీ గురించి ప్ర‌స్థావిస్తూ .. జెస్సీ & జెర్రీ కంటిన్యూ 2 ఫైట్ అంటూ ట్వీట్ చేశాడు సుధీర్‌. ప‌నిలో ప‌నిగా స‌మంత యూట‌ర్న్ ట్రైల‌ర్ బావుందంటూ కితాబిచ్చేశాడు. దానికి రిప్ల‌య్ ఇచ్చిన సామ్ అయ్యో….! నో…! అంటూ రీట్వీట్ చేసింది. మ‌నిద్ద‌రికీ ఆల్ ది బెస్ట్ ! అంటూ ఫ‌న్ క్రియేట్ చేసింది. ఎవ‌రు ఎవ‌రికి ఆల్ ది బెస్ట్ చెప్పినా సినిమాలో కంటెంట్ విజ‌యాన్ని డిసైడ్ చేస్తుంది. అది జ‌నాల‌కు న‌చ్చాలంతే. ఇక‌పోతే సుధీర్ బాబుకు స‌మంత వ‌ల్ల ఒక‌ర‌క‌మైన పోటీ కాదు. అదే రోజు త‌మిళ్, తెలుగు ద్విభాషా చిత్రం `సీమ‌రాజా` రిలీజ్‌కొస్తోంది. అంటే స‌మంత న‌టించిన రెండు సినిమాలు సుధీర్‌బాబు సినిమాపైకి పోటీకొస్తున్నాయ‌న్న‌మాట‌!!

User Comments