స‌మంత వ‌ర్సెస్ స‌మంత‌.. న్యాయం చేస్తదా?

Last Updated on by

అదేంటి.. స‌మంత‌తో స‌మంత పోటీ ప‌డుతూ నువ్వా నేనా అన‌డం ఏంటి అనుకుంటున్నారా..? ఇండ‌స్ట్రీలో మాత్ర‌మే సాధ్య‌మయ్యే పోటీ ఇది. ఇక్క‌డ ఎవ‌రు ఎప్పుడు ఎవ‌రితో పోటీ ప‌డుతున్నారు అనే విష‌యంతో సంబంధం ఉండ‌దు. పోటీ ప‌డుతున్నారు అనేదే కావాలి. ఒక్కోసారి ఒక్క‌రే న‌టించిన సినిమాలు ఒకేసారి పోటీకి దిగాల్సి వ‌స్తుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుంది. స‌మంత న‌టించిన రెండు సినిమాలు రెండు రోజుల్లో రానున్నాయి. అవే మ‌హాన‌టి అండ్ రంగ‌స్థ‌లం. రెండు సినిమాల‌కు ఓ ప్ర‌త్యేక‌థ ఉంది. ఈ రెండూ ఓల్డ్ బ్యాక్ డ్రాప్ తో వ‌స్తోన్న సినిమాలే. ఒక‌టి 50వ ద‌శ‌కం నుంచి మొద‌లై 70వ ద‌శ‌కం చివ‌ర్లో ముగిసే క‌థ అయితే.. మ‌రోటి 60వ ద‌శ‌కంలో మొద‌లై 80వ ద‌శ‌కంలో అయిపోయే క‌థ‌. సావిత్రి జీవితం ఆధారంగా మ‌హా న‌టి తెర‌కెక్కుతుంది. నాగ్ అశ్విన్ దీనికి ద‌ర్శ‌కుడు.

ఇందులో జ‌మున పాత్ర‌లో న‌టిస్తుంది స‌మంత‌. టైటానిక్ లో ముస‌లామె మాదిరి ఇక్క‌డ కూడా క‌థ‌కు మార్గ‌ద‌ర్శి స‌మంత పాత్రే. ఇక రంగ‌స్థ‌లంలో రామ‌ల‌క్ష్మిగా న‌టిస్తుంది స‌మంత‌. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ లో నిజంగానే ఎంత స‌క్క‌గుందో ఈ భామ‌..! ఇందులో మూగ‌మ్మాయిగా న‌టిస్తుంది స‌మంత‌. సుకుమార్ ద‌ర్శ‌కుడు. ఈ రెండు సినిమాల్లోనూ త‌న పాత్ర షూటింగ్ పూర్తి చేసింది స‌మంత‌. ఖచ్చితంగా ఈ చిత్రం త‌న కెరీర్ ను మ‌రో స్థాయికి తీసుకెళ్తుంద‌ని ఆశిస్తుంది స‌మంత‌. ఇక మ‌హాన‌టి కూడా అంతే. ఈ సినిమా మార్చ్ 29న విడుద‌ల కానుంది. ఇక ఆ మ‌రుస‌టి రోజే రంగ‌స్థ‌లం రానుంది. అంటే ఒక రోజు గ్యాప్ లో స‌మంత న‌టించిన రెండు సినిమాలు రానున్నాయ‌న్న‌మాట‌. మొత్తానికి మ‌రి ఈ రెండు సినిమాలు స‌మంత కెరీర్ ను ఎలా మాయ చేయ‌బోతున్నాయో..!

User Comments