స‌మంత వ‌ర్సెస్ స‌మంత‌

Last Updated on by

గ‌త కొంత కాలంగా స‌మంత స‌క్సెస్ జోరు టాలీవుడ్‌ని వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే. రంగ‌స్థ‌లం, మ‌హాన‌టి, అభిమ‌న్యుడు చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్లు అందుకుంది. ఈ సినిమాల్లో స‌మంత న‌ట‌న‌కు చ‌క్క‌ని గుర్తింపు ద‌క్కింది. న‌టిగా త‌న‌ని తాను నిరూపించుకునే పాత్ర‌ల్ని ఎంచుకుంటూ స్టార్‌గా మ‌రో మెట్టు ఎక్కింది సామ్‌. ఇక మీదటా స‌మంత ఈ స‌క్సెస్ స్ట్రీక్‌ని కొన‌సాగించ‌నుంద‌ని తాజాగా రిలీజ్‌కి రెడీ అవుతున్న సినిమాలు చెబుతున్నాయి.

స‌మంత న‌టిస్తూ, నిర్మిస్తున్న `యూట‌ర్న్‌` సెప్టెంబ‌ర్ 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ని తాజాగా లాంచ్ చేశారు. స‌మంత‌, ఆది పినిశెట్టి ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమా పోస్ట‌ర్ క‌ట్టిప‌డేసింది. ఆన్‌లైన్‌లో ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ టాప్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఈ లుక్ క‌చ్ఛితంగా సినిమాపై అంచ‌నాలు పెంచింద‌నే అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమాకి ప‌వ‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో రాహుల్ ర‌వీంద్ర‌న్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పూర్ణ చంద్ర సంగీతం, నికేత్ బొమ్మి సినిమాటోగ్ర‌ఫీ ప్ల‌స్‌. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ ప‌తాకంపై శ్రీ‌నివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక‌పోతే ఈ సినిమా సెప్టెంబ‌ర్ 13న రిలీజ‌వుతుంద‌ని ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించారు. అదే రోజు సామ్ న‌టించిన త‌మిళ చిత్రం `సీమ‌రాజా` రిలీజ్ కానుంది. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన సీమ‌రాజా ఫ‌స్ట్‌లుక్కి చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. త‌మిళ స్టార్‌హీరో శివ‌కార్తికేయ‌న్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడు. పొన్‌రామ్ వంటి ప్ర‌తిభావంతుడు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డంతో అంచ‌నాలు రెట్టింప‌య్యాయి. యూట‌ర్న్‌లో సామ్ జ‌ర్న‌లిస్టుగా న‌టిస్తోంది. ఇక సీమ‌రాజా చిత్రంలో ఓ ప‌ల్లెటూరి అమ్మాయిగా క‌నిపించ‌నుంది. ఏదేమైనా సామ్ వ‌ర్సెస్ సామ్ మ‌రోసారి క‌న్ఫామ్ అయిన‌ట్టే.

User Comments