ఎన్టీఆర్తో సమంత?

త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కలయికలో రూపొందబోతున్న సినిమాలో కథానాయికగా సమంత ఎంపికైందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. వచ్చే యేడాది వేసవికి రాబోతున్న ఈ సినిమా మేలో కానీ జూన్లో కానీ మొదలు కాబోతోంది. కుటుంబ కథతో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. ఒక పాత్ర కోసం సమంతని ఎంపిక చేశారని సమాచారం. మరో స్థానం కోసం పూజా హెగ్డేని సంప్రదించారు. ఆమె ఓకే చెప్పినట్టే చెప్పి కాల్షీట్లు సర్దుబాటు చేయలేనని హ్యాండ్ ఇచ్చేసిందట. దాంతో త్రివిక్రమ్ ప్రత్యామ్నాయం ఆలోచించాడట.

వెంటనే రష్మిక మందన్నని సంప్రదించారట. ఆమె త్రివిక్రమ్ సినిమా అనేసరికి మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పేసిందట. తీరా ఆమెకి కూడా కాల్షీట్ల సమస్య ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. అయినా సరే… చేస్తానని రష్మిక మాటిచ్చినట్టు తెలిసింది. త్రివిక్రమ్తో సినిమా చేయాలని రష్మిక ఎప్పట్నుంచో అనుకుంటున్నారట. రాక రాక వచ్చిన ఆ అవకాశాన్ని అస్సలు వృథా చేసుకోకూడదని నిర్ణయించుకుందట రష్మిక. మరి చివరికి ఎవరు పక్కా అవుతారనేది తెలియాలంటే మాత్రం మరికొన్నాళ్లు ఆగాల్సిందే.