ఒక్క సినిమా డిసైడ్ చేయ‌దు- శంక‌ర‌

Last Updated on by

ఒకే ఒక్క సినిమాతో భ‌విష్య‌త్‌ని నిర్ణ‌యించ‌లేమ‌ని అంటున్నాడు ష‌క‌ల‌క శంక‌ర్‌. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే భ‌విష్య‌త్‌ ఉండద‌ని అనుకుంటే ఈరోజు చాలా మంది హీరోలు ఉండర‌ని శంక‌ర ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. కమెడియన్ ట‌ర్న్‌డ్ హీరోగా శంక‌ర్‌ న‌టించిన‌ ‘శంభో శంకర’ ఈ శుక్ర‌వారం (29న‌) రిలీజ్‌కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.

రిలీజ్ ప్ర‌మోష‌న్స్‌లో శంక‌ర్ మాట్లాడుతూ పైవిధంగా కామెంట్ చేశాడు. శంక‌ర్ మ‌రిన్ని సంగ‌తులు ముచ్చ‌టిస్తూ – క‌మెడియ‌న్ నుంచి హీరోగా మార‌డానికి కార‌ణం ఉంది. కమెడియన్ గా నా స్థాయికి తగిన, న‌న్ను సంతృప్తిపరచే పాత్రలు రావడం లేదు. అందుకే హీరోను అయ్యాను. ఏదో ఉద్దరించేద్దామనే ఉద్దేశ్య ం అయితే కాదు. త్రివిక్ర‌మ్‌, దిల్‌రాజు వంటి పెద్ద‌ల్ని క‌ల‌వ‌డానికి కార‌ణం.. కొంత డబ్బు పెట్టి సినిమా తీస్తే, పదిమంది బ‌తుకుతారనే ఉద్దేశ్య ంతో వాళ్ళ వద్దకు వెళ్ళాను. అంతా ఎంకరేజ్ చేశారు. కానీ వాళ్లకు నాకు టైమింగ్ సింక‌వ్వ‌లేదు. ఇక గురువుగారు వ‌ర్మ వ‌ద్ద‌కు వెళ్లాలంటే ఆయనే హిట్ కొట్టలేకపోతున్నారు. ఇక ఆయన దగ్గర నేనేం చేస్తాను. ఆయనొక హిట్ కొడితే బాగుంటుందనిపిస్తోంది. నా సినిమా పాట‌ల్ని దిల్‌రాజు, వినాయ‌క్, ట్రైల‌ర్‌ని హ‌రీష్ రిలీజ్ చేసి ఆశీర్వ‌దించారు. త్రివిక్రమ్ గారిని కలుద్దామనుకుంటే ఆయన ఎన్టీఆర్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అలానే ఈ క‌థ‌ను ద‌ర్శ‌కుడు శ్రీ‌ధ‌ర్, నేను క‌లిసి త‌యారు చేసుకున్నాం. క‌థ త‌న‌దే.. కానీ ఇద్ద‌రం డెవ‌ల‌ప్ చేశాం. ఓ రకంగా నేను ఈ సినిమాకి అసిస్టెంట్ ద‌ర్శ‌కుడిని అనుకోవ‌చ్చు. అలానే ట్రైల‌ర్‌ రిలీజ్ త‌ర్వాత .. ప‌వ‌న్ క‌ల్యాణ్ రిఫ‌రెన్స్ రావ‌డానికి కార‌ణం.. అది నాక్కూడా తెలీకుండా వచ్చింది. కావాలని చేసుంటే అది ఇమిటేషన్ అయ్యుండేది. కానీ సినిమాలో అలా లేదు. చాలా మంది బాగా చేశావని మెచ్చుకున్నారని తెలిపారు. ఈ సినిమాతో నేను స్టార్‌ని కాదు.. ఒక మంచి నటుడ్ని అవుతానని మాత్రం చెప్పగలను అన్నారు. శంక‌ర్ ఇదివ‌ర‌కూ త్రివిక్ర‌మ్, దిల్‌రాజు వంటి సినీపెద్ద‌ల్ని త‌న‌దైన శైలిలో సెటైరిక‌ల్‌గా మాట్లాడినా త‌ప్పును గ్ర‌హించి అత‌డు అంద‌రితో సినిమాలు ఉంటాయ‌ని చెప్ప‌డం హైలైట్.

User Comments