ఆ సీక్వెల్ మాస్‌రాజా చేస్తాడా?

Last Updated on by

త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ `నాడోడిగ‌ల్` తెలుగులో `శంభో శివ శంబో` పేరుతో రీమైకై విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. మాస్ మ‌హారాజా ర‌వితేజ త‌న కెరీర్‌లో ఒకానొక బెస్ట్ సినిమా ఇద‌ని ప‌లు ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు. ఈ సినిమాకి సీక్వెల్ తీస్తే న‌టిస్తారా? అన్న ప్ర‌శ్న‌కు త‌ప్ప‌కుండా అని స‌మాధానం ఇచ్చారు. అందుకే ఈ సినిమాకి త‌మిళ‌నాట సీక్వెల్ రిలీజ‌వుతోంది అన‌గానే ఒక‌టే ఉత్కంఠ‌.

`శంభో శివ శంబో` చిత్రానికి స‌ముదిర‌క‌ని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్పుడు సీక్వెల్ తెర‌కెక్కిస్తున్నారు. శ‌శికుమార్, అంజ‌లి త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టించారు. అంజ‌లి ఎమోష‌న్ ఈ సినిమాలో ప‌తాక‌స్థాయిలో ఉంటుంద‌ని తాజాగా రిలీజైన టీజ‌ర్ చెబుతోంది. ఇది `నాడోడిగ‌ల్ -2` సెకండ్ లుక్ అంటూ టీజ‌ర్‌ని రిలీజ్ చేశారు. టీజ‌ర్ లో ఎమోష‌న్ ఆక‌ట్టుకుంది. అయితే ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తారా? చేస్తే మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తారా? అన్న‌ది తేలాల్సి ఉందింకా.

User Comments