స‌మ్మోహ‌నం హిట్టేనంట‌

Last Updated on by

సుధీర్ బాబు – అదితీరావ్ హైద‌రీ జంట‌గా ఇంద్ర‌గంటి ప్ర‌యోగం స‌మ్మోహ‌నం హిట్టా ఫ‌ట్టా? అంటే ఈ సినిమాపై ట్రేడ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన టాక్ వినిపిస్తోంది. స‌మ్మోహ‌నం చ‌క్క‌ని సినిమా. అందులో డౌట్సేమీ లేవు. కానీ ఆశించినంత బ్లాక్‌బ‌స్ట‌ర్ మాత్రం కాదు. సుధీర్ బాబు కెరీర్‌కి ఓ మంచి సినిమా మాత్ర‌మేన‌న్న టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాని కేవ‌లం 9 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కించారు. ఫుల్‌ర‌న్‌ వ‌సూళ్లు 6కోట్లు. శాటిలైట్ రూపంలో మ‌రో 3కోట్లు ద‌క్కింది. అంటే పెట్టిన పెట్టుబ‌డి తిరిగి వెన‌క్కి వ‌చ్చేసింది. తెలుగులో సుధీర్‌బాబుకి హిట్ సినిమా కిందే లెక్క‌.. అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని ఆదిత్య 369 నిర్మాత శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ నిర్మించార‌న్న‌దాంట్లో ఏమాత్రం నిజం లేద‌ని, షాడో ఇన్వెస్ట‌ర్ వేరొక‌రు ఉన్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఇక‌పోతే అమెరికాలో సుధీర్ బాబు స్థాయిని స‌మ్మోహ‌నం పెంచింది. అక్క‌డ స‌మ్మోహ‌నం 490కె డాల‌ర్లు వ‌సూలు చేసింది.

User Comments