Last Updated on by
టైటిల్ కు తగ్గట్లే సమ్మోహనపరుస్తుంది సమ్మోహనం. తొలి మూడు రోజులు పర్లేదనే వసూళ్లనే తీసుకొచ్చింది ఈ చిత్రం. నాలుగో రోజు కూడా ఎక్కడ కలెక్షన్లు తగ్గకపోవడం గమనార్హం. ఈ చిత్రం ఇప్పటి వరకు 4.5 కోట్ల షేర్ తీసుకొచ్చింది. మామూలుగా ఇవి తక్కువ కావచ్చు కానీ సుధీర్ బాబు రేంజ్ కు మాత్రం ఇది చాలా ఎక్కువ. ఎందుకంటే ఈయన సినిమాలు గతంలో ఇంతకంటే తక్కువ వసూళ్లు తీసుకొచ్చాయి.
ఇంద్రగంటి మ్యాజిక్ కు తోడు.. సుధీర్ బాబు యాక్షన్.. అదితిరావ్ అందంతో సమ్మోహనం ఆకట్టుకుంటుంది. నా నువ్వే డిజాస్టర్ కావడం ఈ చిత్రానికి కలిసొస్తుంది. ఇప్పటి వరకు బాగానే వసూలు చేస్తున్న ఈ చిత్రం రెండో వారం కూడా సత్తా చూపించడం ఖాయమైపోయింది. ఎందుకంటే జూన్ 29 వరకు చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదల కావడం లేదు. దాంతో మరో వారం రోజులు ఈ సినిమానే సత్తా చూపించేలా కనిపిస్తుంది. జూన్ 29న సంజూ.. ఈ నగరానికి ఏమైంది విడుదల కానున్నాయి. అప్పటి వరకు ఈ సినిమానే జోరంతా.
User Comments