స‌మ్మోహ‌నంగా దాటేసిందిగా..!

Last Updated on by

ఒక్కోసారి పాజిటివ్ టాక్ వ‌చ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల వేట‌లో వెన‌క‌బ‌డుతుంటాయి. ఇప్పుడు స‌మ్మోహ‌నం కూడా ఇదే ప‌రిస్థితి. తొలిరోజే హిట్ టాక్ వ‌చ్చినా కూడా తెలుగు రాష్ట్రాల్లో స‌మ్మోహ‌నం నామ‌మాత్ర‌పు వ‌సూళ్లే సాధించింది. తొలి వారం 5 కోట్ల మార్క్ అందుకుంది అంతే. కానీ ఓవ‌ర్సీస్ లో మాత్రం ఈ చిత్రం మంచి వ‌సూళ్లు సాధిస్తుంది. సైలెంట్ గా స‌మ్మోహ‌నంగా హాఫ్ మిలియ‌న్ మార్క్ దాటేసింది ఈ చిత్రం. సుధీర్ బాబు కెరీర్ లో తొలిసారి హాఫ్ మిలియ‌న్ మార్క్ సినిమా అందుకున్నాడు.

ఈయ‌న సినిమాలు గ‌తంలో ల‌క్ష డాల‌ర్లు కూడా తీసుకురావ‌డానికే ఇబ్బందులు ప‌డ్డాయి. అలాంటిది ఇప్పుడు 5 ల‌క్ష‌ల 18 వేల డాల‌ర్లు వ‌సూలు చేసింది స‌మ్మోహ‌నం. ఇంద్ర‌గంటి మ్యాజిక్ కు తోడు.. సుధీర్ బాబు యాక్ష‌న్.. అదితిరావ్ అందంతో స‌మ్మోహ‌నం ఆక‌ట్టుకుంటుంది. నా నువ్వే డిజాస్ట‌ర్ కావ‌డం ఈ చిత్రానికి క‌లిసొస్తుంది. వీక్ డేస్ లో బాగా వీక్ అయినా కూడా వీకెండ్ లో మ‌ళ్లీ పుంజుకుంది. కొత్త సినిమాలేవీ లేక‌పోవ‌డంతో స‌మ్మోహ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు మంచి వ‌సూళ్లే సాధిస్తూ వ‌స్తుంది. జూన్ 29న ఈ న‌గ‌రానికి ఏమైంది వ‌చ్చే వ‌ర‌కు సినిమాలేవీ లేక‌పోవ‌డంతో స‌మ్మోహ‌నం మ‌రిన్ని వ‌సూళ్లు సాధించే అవ‌కాశం లేక‌పోలేదు.

User Comments