స‌మ్మోహ‌నంగా మాయ చేసారే..!

Last Updated on by

మ‌నం ఏదైనా చూసిన‌పుడు చూపు తిప్పుకోలేనంత‌గా మాయ చేస్తుంటే ఆహా ఎంత స‌మ్మోహ‌నంగా ఉంది అంటాం. ఇప్పుడు ఇలాంటి సినిమా ఒక‌టి తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. ఈయ‌న తెర‌కెక్కిస్తోన్న స‌మ్మోహ‌నం టీజ‌ర్ విడుద‌లైంది. సుధీర్ బాబు, అదితి రావ్ హైద్రీ జంట‌గా న‌టిస్తోన్న ఈ చిత్ర షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ లో బిజీగా ఉంది టీం. ఇన్నాళ్లూ చిన్న బ‌డ్జెట్ సినిమాల‌తోనే కాలం గ‌డిపిన ఇంద్ర‌గంటి.. ఈ సారి మాత్రం కాస్త రేంజ్ పెంచేసాడు. ఇన్నాళ్ళూ ఈ చిత్రాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు కానీ ఇప్పుడు టీజ‌ర్ చూసిన త‌ర్వాత మాత్రం ప‌ట్టించుకోక‌పోతే చాలా మంది హీరోల‌కు త‌ల‌నొప్పులు త‌ప్ప‌వు. ఎందుకంటే మ‌ణిర‌త్నం సినిమా మాదిరి విజువ‌ల్స్ తో పిచ్చెక్కించాడు సినిమాటోగ్రాఫ‌ర్ పిజి విందా. పైగా ఇంద్ర‌గంటి ట్రాక్ రికార్డ్ ఈ సినిమాకు అతిపెద్ద ప్ల‌స్.

పెద్ద హీరోలు లేకుండానే పెద్ద విజ‌యాలు అందుకుంటాడు ఈ ద‌ర్శ‌కుడు. గ‌తేడాది కూడా ఈయ‌న తెర‌కెక్కించిన అమీతుమీ మంచి విజ‌యం సాధించింది. చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద హిట్ అయింది ఈ చిత్రం. ఇప్పుడు సుధీర్ బాబు సినిమాపై కూడా అంచ‌నాలు బాగానే ఉన్నాయి. శివలెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జెంటిల్ మ‌న్ త‌ర్వాత మ‌ళ్లీ ఈ కాంబినేష‌న్ లో సినిమా వ‌స్తుంది. టీజ‌ర్ చూసిన త‌ర్వాత క‌చ్చితంగా సుధీర్ బాబుకు హిట్ వ‌చ్చేలాగే క‌నిపిస్తుంది. మ‌రి.. సుధీర్ కోరుకున్న విజ‌యాన్ని స‌మ్మోహ‌నంగా ఇంద్ర‌గంటి ఇస్తాడో లేదో..?

 

User Comments