ట్రైల‌ర్‌: ట్రాజిక్ స‌మ్మోహ‌నం

Last Updated on by

ఇటీవ‌లి కాలంలో తెలుగు సినిమాల క‌థ మారింది. సినిమాల్లో కంటెంట్ ఆక‌ట్టుకుంటోంది. ఆ కోవ‌లోనే వ‌స్తున్న సినిమా ఇదీ.. అని ఖ‌రాకండిగా చెబుతోంది `స‌మ్మోహ‌నం`. సుధీర్‌బాబు-పాల‌మూరు అమ్మాయి అదితీరావ్ హైద‌రీ జంట‌గా ఇంద్ర‌గంటి మోహ‌న్‌కృష్ణ తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో చాలా గ‌మ్మ‌త్త‌యిన ఎలిమెంట్ ఉంద‌ని ట్రైల‌ర్లు చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే రిలీజైన పోస్ట‌ర్ల‌కు స్పంద‌న బావుంది. రీసెంటుగానే రిలీజైన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది.

 

తాజాగా సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా స‌మ్మోహ‌నం కొత్త ట్రైల‌ర్‌ని రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్ ఆద్యంతం నాయ‌కానాయిక‌ల మ‌ధ్య స‌మ్మోహ‌నం ఆక‌ట్టుకుంటోంది. సినిమా ఆద్యంతం ఫిల్మీబ్యాక్‌డ్రాప్‌తో న‌డిచే క‌థాంశం అని అర్థమవుతోంది. సినిమాల్లో న‌టించే అందాల క‌థానాయిక‌కు, అస‌లు సినిమాలు అంటే గిట్ట‌ని కుర్రాడికి మ‌ధ్య స‌మ్మోహ‌నం ఏంటి? అన్న‌ది తెర‌పైనే చూడాలి. సుధీర్‌బాబు -అదితీరావ్ హైద‌రీ మ‌ధ్య రొమాన్స్ ఆక‌ట్టుకుంటోంది. జోడీ కుదిరింది.. రొమాన్స్ సెట్ట‌యింది. భిన్న ధృవాలు ఆక‌ర్ష‌ణ‌కు గుర‌వుతాయి! అన్న ఫార్ములాని ఈ సినిమా క‌థ‌కు అప్ల‌య్ చేశాడు ఇంద్ర‌గంటి. సినిమావాళ్లు న‌చ్చ‌ని కుర్రాడు సినిమా క‌థానాయిక ప్రేమ‌లో ప‌డ‌డం అన్న పాయింట్ అస‌లైన యుఎస్‌పి. అంద‌రు ప్రేమికుల్లానే ఆ ఇద్ద‌రి ప్రేమ‌లో చివ‌రిలో ట్రాజిక్ సీన్ ఉంద‌ని ట్రైల‌ర్ ముగింపులో ట్విస్టిచ్చాడు. చూద్దాం.. త్వ‌ర‌లో రిలీజ్‌కి వ‌స్తున్న ఈ సినిమాలో అస‌లు మ్యాట‌రెంతో!

User Comments