హాకీప్లేయ‌ర్‌గా సందీప్ కిష‌న్

Sundeep Kishan’s ‘A1 Express’ Film Announcement

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు సందీప్ కిష‌న్. హిట్టొచ్చినా..ప్లాప్ లొచ్చినా అత‌డు ఎప్పుడూ ఖాళీగా లేడు. తెలుగు, త‌మిళ్ లో ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్నాడు. వ‌రుస ప‌రాజ‌యాల నేప‌థ్యంలో ఇటీవ‌లే `నిను వీడ‌ని నీడ‌ను నేను` సినిమాతో స‌క్సెస్ అందుకున్నాడు. కొన్ని సంవ‌త్స‌రాల త‌ర్వాత వ‌చ్చిన స‌క్సెస్ ఇది. ప్ర‌స్తుతం తెలుగులో తెనాలి రామ‌కృష్ణుడు, త‌మిళ్ లో రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇది కేవ‌లం 2019 క్యాలెండర్ ఇయ‌ర్ కి మాత్ర‌మే. 2020లోకి అడుగు పెట్ట‌డానికి ఇంకా రెండు నెల‌లే స‌మ‌యమే మిగిలి ఉంది. ఈ నేప‌థ్యంలో కొత్త ఏడాది ప్రారంభానికి ముందే అప్పుడే కొత్త ప్రాజెక్ట్ ను ప్ర‌కటించాడు సందీప్.

`ఏ1 ఎక్స్ ప్రెస్` సినిమా చేస్తున్న‌ట్లు దీపావళి సంద‌ర్భంగా పోస్ట‌ర్ రిలీజ్ చేశాడు. ఇది స్పోర్స్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రం అని అర్థ‌మ‌వుతోంది. హాకీ స్టిక్ తో గ్రౌండ్ లో వెన‌క్కి తిరిగి నుంచున్న స్టిల్ రిలీజ్ చేసారు. అలాగే న‌వంబ‌ర్ లో షూటింగ్ ప్రారంభిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. హీరోయిన్ పేరును రివీల్ చేయ‌లేదు. ఈ చిత్రానికి హిప్ హాప్ త‌మిజ సంగీతం అందిస్తున్నారు. టి. జి విశ్వ ప్ర‌సాద్- అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబోట్ల స‌హ నిర్మాత‌గా వ్వ‌వ‌హ‌రిస్తున్నారు. డెన్నీస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.