సంజూభాయ్ డూప్ ఆగ‌యా..!

Last Updated on by

సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ టీజ‌ర్ విడుద‌లైంది. ఇది చూసిన త‌ర్వాత అంతా ఒకే మాట అంటున్నారు.. ఏంటీ అద్భుతం మ‌నుషుల్ని మార్చే మిష‌న్ కానీ రాజ్ కుమార్ హిరాణీ ద‌గ్గ‌ర ఉందా ఏంటి అని..? లేక‌పోతే మ‌రేంటి.. అస‌లు సంజూ టీజ‌ర్ లో సంజ‌య్ ద‌త్ గా ర‌ణ్ బీర్ క‌పూర్ ను చూసి అంతా షాక్ అవుతున్నారు. అక్క‌డున్న‌ది నిజంగానే ర‌ణ్ బీర్ క‌పూరా లేదంటే సంజ‌య్ ద‌త్ డూప్ గానీ వ‌చ్చి న‌టించాడా అని ఆశ్చ‌ర్యం త‌ప్ప‌దు. ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌కుడు కావ‌డంతో అంచ‌నాలు ఆకాశంలో ఉన్నాయి. ఇప్పుడు విడుద‌లైన టీజ‌ర్ కూడా ఇలాగే ఉంది. ఇందులో సంజ‌య్ ద‌త్ లైఫ్ లోని ప్ర‌తీ చిన్న విష‌యాన్ని చూపించాడు ద‌ర్శ‌కుడు. వివాదాల‌నే ఎక్కువ‌గా చూపిస్తున్న‌ట్లు టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మైపోతుంది. నీళ్లు తాగినంత ఈజీగా ఇండ‌స్ట్రీ హిట్లు కొట్టే ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ హిరాణి. అలాంటి ద‌ర్శ‌కుడు త‌న‌కు అత్యంత స‌న్నిహితుడు అయిన సంజ‌య్ ద‌త్ బ‌యోపిక్ ను హ్యాండిల్ చేస్తున్నాడు.

అందులో ర‌ణ్ బీర్ క‌పూర్ ఉన్నాడు. ఇంకేం కావాలి ఓ సినిమాపై అంచ‌నాలు ఇంత‌కంటే పెర‌గ‌డానికి. ఒక‌ప్పుడు వ‌ర‌స హిట్ల‌తో జోరు మీదున్న ర‌ణ్ బీర్ క‌పూర్ ఇప్పుడు వ‌ర‌స ప్లాపుల్లో ఉన్నాడు. ఈయ‌న‌ సినిమాల‌కు క‌నీసం ఓపెనింగ్స్ కూడా రావ‌డం లేదు. ఇది క‌దా ద‌రిద్రం అంటే. బేష‌ర‌మ్.. రాయ్.. బాంబే వెల్‌వెట్.. తమాషా.. ఇలా అన్ని సినిమాలు డిజాస్ట‌ర్లే.  ఇప్పుడు మ‌నోడి ఆశ‌ల‌న్నీ రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కిస్తోన్న సంజయ్ దత్ జీవిత క‌థ‌పైనే ఉన్నాయి. సంజూ టైటిల్ తో ఈ సినిమా వ‌స్తుంది. జ‌న‌వ‌రి 21నే షూటింగ్ కూడా పూర్త‌యింది. త్వ‌ర‌లోనే టీజ‌ర్ విడుద‌ల చేయ‌నున్నారు. ఈ చిత్రంలో సంజ‌య్ ద‌త్ వివాదాల‌తో పాటు జీవితాన్ని మొత్తం చూపించ‌బోతున్నాడు రాజ్ కుమార్ హిరాణి. జూన్ 29న సినిమా విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఈ చిత్రంతోనైనా ర‌ణ్ బీర్ కెరీర్ గాడిన ప‌డుతుందో లేదంటే మ‌రింత దిగ‌జారుతుందో..?

User Comments