308 మంది గాళ్స్‌తో శృంగారం

Last Updated on by

బాలీవుడ్ ఖ‌ల్‌నాయ‌క్ సంజ‌య్‌ద‌త్ బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. `సంజు` అనేది టైటిల్. ఈ బ‌యోపిక్‌లో క‌ళ్లు భైర్లు క‌మ్మే నిజాలెన్నిటినో మున్నాభాయ్ స్నేహితుడు రాజ్‌కుమార్ హిరాణీ చూపించ‌బోతున్నార‌ట‌. ద‌త్‌లోని రొమాంటిక్ యాంగిల్‌ని ఓ రేంజులో ఎలివేట్ చేస్తున్నాడ‌ని తెలిసింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సంజు భాయ్ గుండెల‌దిరే క‌ఠోర‌మైన నిజాన్ని లీక్ చేశాడు. అత‌డు త‌న లైఫ్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఏకంగా 308 మంది అమ్మాయిల‌తో సెక్స్‌లో పాల్గొన్నాడ‌ట‌. అంత‌మంది అమ్మాయిల్ని అత‌డు ఎలా ప‌డేశాడు? అని అడిగితే దానికి రాజ్‌కుమార్ హిరాణీ అంతే పెద్ద షాకిచ్చే ఆన్స‌ర్ ఇచ్చాడు.

సంజూ భాయ్ తాను ప్రేమించిన అమ్మాయిని తొలుత శ్మ‌శానంలోకి తీసుకెళ్లేవాడు. అక్క‌డ త‌న త‌ల్లి స‌మాధిని చూపించి నువ్వు అమ్మ‌తో స‌మానం అనేసేవాడు. దాంతో ఎమోష‌న్ అయిపోయిన అమ్మాయిలంతా అత‌డికి కావాల్సింది స‌మ‌ర్పించేసుకునేవార‌ట‌. అలా మొత్తం 308 మంది గాళ్స్‌ని అత‌డు శ్మ‌శానంలోకి తీసుకెళ్లి, అటుపై మంచ‌మెక్కించాడ‌న్న‌ది హ‌ఠాత్తుగా ఇలా ప‌బ్లిక్‌కి లీకైంది. ఇంట్రెస్టింగ్‌గా సంజూ భాయ్ అంత‌మందితో అలా శృంగార క‌లాపం సాగించాడ‌న్న‌ది ఎంద‌రికో క‌న్ను కుట్టేసింది. ముఖ్యంగా ర‌ణ‌బీర్ క‌పూర్ అయితే నిదుర‌పోవ‌డం లేదుట‌. ఆయ‌న కౌంట్ 308, నా కౌంట్ ఇంకా 10 లోపే అంటూ లెక్క‌లు పెట్టుకుంటున్నాడట‌. మొత్తానికి పెనుకంపంలోంచి పుట్టే భూకంపం లాంటి సంగ‌తి చెప్పాడు సంజూ భాయ్‌.

User Comments