`సంజు` వ‌సూళ్లు 500కోట్లు

Last Updated on by

బాలీవుడ్ ఖ‌ల్ నాయ‌క్ సంజ‌య్‌ద‌త్ బ‌యోపిక్ ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో వేడెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. `సంజు` రెండో వారంలో అడుగుపెట్టినా ఇంకా ఇంకా జ‌నాద‌ర‌ణ పొందుతున్న సినిమా ఇది. కేవ‌లం తొలి రెండు రోజుల్లోనే 100కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టిన ఈ సినిమా ఇప్ప‌టికి 500కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. ఫుల్ ర‌న్‌లో ప‌లు రికార్డుల్ని ఈ సినిమా బ్రేక్ చేస్తుంద‌న్న అంచ‌నాలేర్ప‌డ్డాయి. స‌ల్మాన్ టైగ‌ర్ జిందా హై త‌ర్వాత అత్యంత వేగంగా క‌లెక్ష‌న్లు సాధిస్తున్న ఏకైక సినిమాగా రికార్డుల‌కెక్కింది.

త‌న స్నేహితుడు సంజ‌య్‌ద‌త్‌కి గ్రేట్ ఫ్రెండ్ రాజ్‌కుమార్ హిరాణీ ఇచ్చిన గిఫ్ట్ ఇద‌ని చెప్పొచ్చు. సంజు ఇప్ప‌టికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 500కోట్లు వ‌సూలు చేయ‌గా, ఇండియాలో 378 కోట్లు వ‌సూలు చ‌సింది. ఓవ‌ర్సీస్ నుంచి 122 కోట్లు తెచ్చింది. ఈ విజ‌యం అసాధార‌మైన‌ది. ప‌ద్మావ‌త్ -3డి రికార్డుల్ని తేలిగ్గా బ్రేక్ చేస్తోంది ఈ 2డి సినిమా. అద్భుత‌మైన ఎమోష‌న్‌, వాస్త‌విక‌త‌, స‌హ‌జ‌సిద్ధ‌త ప్రేక్ష‌కుల్ని ఎంత‌గా మెస్మ‌రైజ్ చేస్తున్నాయో చెప్పేందుకు సంజు సినిమా ఓ పెద్ద ఎగ్జాంపుల్‌.

User Comments