వాటాలు కుద‌ర‌క హీరోల కొట్లాట‌

Last Updated on by

ఓవ‌ర్‌నైట్ బ‌ళ్లు ఓడ‌ల‌వుతాయి. ఓడ‌లు బ‌ళ్ల‌వుతాయి.. అంటే ఇదేనేమో! ఒకే ఒక్క బంప‌ర్ హిట్ ఆ హీరో ఫేట్ మార్చేసింది. ఒకే ఒక్క ఫ్లాప్‌తో అయిపోయాడ‌నుకున్న‌వాడే ఒక్క‌సారిగా తారాప‌థంలోకి దూసుకొచ్చేశాడు. ఇప్పుడు అత‌డు స‌ల్మాన్ ఖాన్ కంటే ఎంతో గొప్ప‌. అంత‌గా మారిపోయింది సీను. ఇంత‌కీ ఎవ‌రా హీరో? అంటే.. ఇంకెవ‌రు? చాక్లెట్‌బోయ్‌.. రొమాంటిక్ గ‌య్‌ ర‌ణ‌బీర్ క‌పూర్‌.

ర‌ణ‌బీర్ క‌పూర్ న‌టించిన తాజా చిత్రం `సంజు` బాక్సాఫీస్ వ‌ద్ద అసాధార‌ణ విజ‌యం సాధించి ఇప్ప‌టికీ వ‌సూళ్ల త‌డాఖా చూపిస్తోంది. ఈ సినిమా ఇప్ప‌టికే 315కోట్ల నెట్ వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. గ్రాస్ ప‌రంగా 500కోట్లు వ‌సూలు చేసింద‌న్న లెక్క‌ల్ని ఇదివ‌ర‌కూ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు. ఈ ఫ‌లితం స‌ల్మాన్ న‌టించిన `రేస్ 3`ని మించి. రేస్ 3 ఓపెనింగుల్ని సైతం సంజు అధిగ‌మించ‌డంతో ర‌ణ‌బీర్‌ని ఇప్పుడు స‌ల్మాన్ కంటే పెద్ద స్టార్‌గా గౌర‌విస్తున్నారు. బిజినెస్ ప్ర‌పంచంలో ఏదైనా ఇంతే. ఓవ‌ర్‌నైట్ స్టార్‌డ‌మ్ మారిపోతుంది. అయితే ఈ ఒక్క బ్లాక్‌బ‌స్ట‌ర్‌ తెచ్చిన ముప్పు అంతే ఇదిగా ఉంది. ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ దెబ్బ‌కు ర‌ణ‌బీర్ తాను న‌టించే త‌దుప‌రి సినిమాకి 70శాతం వాటా నాదేనంటున్నాడుట‌. వాస్త‌వానికి తండ్రి కొడుకుల క‌థ‌తో ల‌వ్ రాంజాన్ (సోనుకి టిటు కి స్వీటీ డైరెక్ట‌ర్) తీయాల‌నుకున్న సినిమా కోసం అజ‌య్‌దేవ‌గ‌న్‌, ర‌ణ‌బీర్‌ల‌తో మాటా మంతీ సాగిస్తున్నారు. అయితే సంజు రిలీజ్ ముందు ఒక‌మాట‌. రిలీజ్ త‌ర్వాత ఇంకోమాట చెబుతున్నాడ‌ట ర‌ణ‌బీర్‌. సంజు రిలీజ్ ముందు 40శాతం వాటా అజ‌య్ దేవ‌గ‌న్‌కి, 20శాతం వాటా ర‌ణ‌బీర్‌కి ఇస్తామ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మాటిచ్చారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. సీనియ‌ర్ హీరో అజ‌య్‌దేవ‌గ‌న్‌కి వాటా త‌గ్గిపోయింది. నా ఒక్క‌డికే 70శాతం వాటా కావాలి అన్న‌ట్టే ర‌ణ‌బీర్ వాల‌కం ఉంద‌ని తెలుస్తోంది. బాలీవుడ్‌లో స్టూడియోలు, నిర్మాత‌లు లేకుండానే వాటాల ప్రాతిప‌దిక‌న సినిమా మొద‌లెట్ట‌డం అన్న ప‌ద్ధ‌తి ఉంది. ప్రాఫిట్ షేర్ బేసిస్‌లో ఫిలింమేకింగ్ అక్క‌డ కామ‌నే. దేవ‌గ‌న్‌తో క‌లిసి ర‌ణ‌బీర్ న‌టిస్తున్నాడు అన‌గానే బిజినెస్ వ‌ర్గాల్లో ఒక‌టే ఆస‌క్తి పెరిగింది. సంజు రిజ‌ల్ట్ మొత్తం మార్చేసింది. బాలీవుడ్‌లో భారీ ఫ్రాంఛైజీల‌న్నీ వాటాల ప్రాతిప‌దిక‌న న‌డుస్తుండ‌డంతో అది హిట్టొచ్చిన హీరోకి అంతే ఇదిగా క‌లిసొస్తోంది. పారితోషికాల‌ను మించి వాటాలు ద‌క్కుతున్నాయి. ర‌ణ‌బీర్‌తో వాటాల విష‌యంలో దేవ‌గ‌న్‌కి చిక్కొచ్చిప‌డ‌డంతో ఈ స‌మ‌స్య‌ను సాల్వ్ చేయ‌డానికి ల‌వ్ రాంజాన్ ట్రై చేస్తున్నార‌ట‌. 60 + 30 వాటాల ప‌ద్ధ‌తిలో ర‌ణ‌బీర్ – అజ‌య్‌ల‌ను సెట్ చేయాల‌ని చూస్తున్నాడ‌ట‌ అదీ సంగ‌తి.

User Comments