సంజూ దెబ్బ‌కు బాహు..బ‌లి..!

Last Updated on by

బాహుబ‌లి రికార్డులు తిర‌గ‌రాయ‌డం అంత ఈజీ కాద‌ని ఫిక్స్ అయిపోయారంతా. కానీ సంజూ మాత్రం దాన్ని చేసి చూపించాడు. ఈ చిత్రం బాహుబ‌లి 2 రికార్డుల‌ను కూడా క‌దిలిస్తుంది. తొలి రోజు నుంచే రికార్డుల వేట మొద‌లుపెట్టిన సంజూ బాబా.. మూడు రోజులు ముగిసేస‌రికి మ‌రింత పీక్స్ కు చేరాడు. విడుద‌లైన మూడో రోజు ఏకంగా 46 కోట్ల 71 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది ఈ చిత్రం. ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు హైయ్య‌స్ట్ సింగిల్ డే క‌లెక్ష‌న్ ఇదే. దీనికి ముందు బాహుబ‌లి 2 పేరు మీద ఈ రికార్డ్ ఉంది. ఈ చిత్రం 46 కోట్ల 50 ల‌క్ష‌లు వ‌సూలు చేసింది.

ఇప్పుడు సంజూ దానికంటే 20 ల‌క్ష‌లు ఎక్కువే వ‌సూలు చేసి ఆల్ టైమ్ రికార్డులు సెట్ చేసింది. మూడు రోజుల్లో 120 కోట్ల‌కు పైగా నెట్ వ‌సూలు చేసింది సంజూ. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ లెక్క 200 కోట్ల‌కు చేరువ‌గానే ఉంది. ఐదేళ్లుగా హిట్లు లేని ర‌ణ్ బీర్ క‌పూర్ ఒకేసారి ఆక‌లి మొత్తం తీర్చుకుంటున్నాడు. వీక్ డేస్ లో కూడా సంజూ వ‌సూళ్లు త‌గ్గుముఖం ప‌ట్టేలా క‌నిపించ‌ట్లేదు. ఇప్ప‌టికీ అన్ని చోట్లా ఈ చిత్రానికి ఫుల్ క‌లెక్ష‌న్స్ వ‌స్తున్నాయి. మ‌రి.. ఫుల్ ర‌న్ లో సంజూ ఇంకెన్ని రికార్డుల‌కు చెక్ పెడుతుందో..?

User Comments