సంజయ్ దత్ టెర్రరిస్టు కాదు

పోలీసుల ముందు బ‌ట్ట‌లిప్పి నించోవ‌డం.. జైల్లో తాను ఉన్న సెల్లోకి బాత్రూమ్ వాట‌ర్ పంపించ‌డం.. క‌నీసం మ‌నిషిలా కూడా ట్రీట్ చేయ‌ని విధానం.. స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా జైల్లో సాధార‌ణ వ్య‌క్తిలా జీవితం.. జీవితమంతా టెర్ర‌రిస్ట్ ముద్ర మోయ‌డం.. ఇవ‌న్నీ సంజ‌య్ ద‌త్ జీవితంలో జ‌రిగాయి. నిజానికి ఆయ‌న జైల్లో ఎలా ఉన్నాడు అంటే ఏముంది రాజ‌యోగాలు అనుభ‌వించి ఉంటాడు అనుకుంటారు. కానీ అవ‌న్నీ అబ‌ద్ధ‌మే అని.. సంజ‌య్ ద‌త్ జీవితంలో కూడా చాలా దారుణాలు జ‌రిగాయని ఇప్పుడు ఈయ‌న బ‌యోపిక్ ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మైపోతుంది.

ఎవ‌రికీ తెలియ‌కుండా.. ఏం సంద‌డి లేకుండా సంజూ ట్రైల‌ర్ విడుద‌ల చేసాడు ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ హిరాణి. ఇది చూసిన త‌ర్వాత మాట‌లు అస‌లు లేవు.. రావు కూడా. స్నేహితుడు క‌దా బ‌యోపిక్ ను సంజ‌య్ ద‌త్ పై ఉన్న చెడు ఇమేజ్ ను తొల‌గించ‌డానికి తీస్తున్నాడేమో అనుకున్నారు కొంద‌రు. కానీ సంజూ జీవితాన్ని పూస‌గుచ్చిన‌ట్లు చూపిస్తున్నాడు హిరాణీ. అస‌లు ఇప్ప‌టి వ‌ర‌కు సంజ‌య్ ద‌త్ జీవితంలో ప్ర‌పంచం చూడ‌ని చాలా విష‌యాల‌ను ఇందులో చూపిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ట్రైల‌ర్ చూస్తుంటేనే రేపు సినిమా ఎలా ఉండ‌బోతుందో అర్థ‌మైపోతుంది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా మూడు నిమిషాలు ట్రైల‌ర్ విడుద‌ల చేసాడు ద‌ర్శ‌కుడు.

ఇక సంజ‌య్ ద‌త్ గా ర‌ణ్ బీర్ క‌పూర్ న‌ట‌న మామూలుగా లేదు. ఆయ‌న పాత్ర‌లో జీవించాడు అంతే. ప్ర‌తీ సీన్ లోనూ సంజ‌య్ క‌నిపించాడు. దావూద్ తో దోస్తానా నుంచి.. అక్ర‌మాయుధాల రవాణా.. కేసులు.. ఇల్లీగ‌ల్ ఎఫైర్స్.. ఇలా ఏ ఒక్క విష‌యాన్ని కూడా దాచిపెట్ట‌లేదు రాజ్ కుమార్ హిరాణీ. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా చూపించేసాడు. ఇక రేపు విడుద‌లైన త‌ర్వాత ఈ చిత్రం క‌చ్చితంగా సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. సంజ‌య్ ద‌త్ తండ్రి సునీల్ ద‌త్ గా ప‌రేష్ రావ‌ల్.. న‌ర్గీస్ గా మ‌నీషా కొయిరాలా.. టినూమొనాయ్ గా సోన‌మ్ క‌పూర్.. ప్ర‌త్యేక పాత్ర‌లో అనుష్క శ‌ర్మ‌.. మాన్య‌త‌గా దియామిర్జా న‌టిస్తున్నారు. జూన్ 29న విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌రి విడుద‌లైన త‌ర్వాత సంజ‌య్ జీవితం ఇంకెన్ని రికార్డులు తిర‌గ‌రాస్తుందో..?