భ‌గ‌భ‌గ మండిన క‌మెడిన్

Last Updated on by

ష‌క‌ల‌క శంక‌ర్ న‌టించిన `శంభో శంక‌ర‌` ఈనెల 29న రిలీజ్‌కి వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌తో శంక‌ర్ బిజీబిజీగా ఉన్నాడు. శీకాకుళం నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కూ వ‌చ్చి, ఇక్క‌డ క‌మెడియ‌న్‌గా రాణించి, అటుపై మూడేళ్ల పాటు హీరోగా అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించి శంక‌ర్ ప‌డిన పాట్లు మామూలుగా ఏం లేవ్‌! ఇదే సంగ‌తిని శంక‌ర్ ఓ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో ప్ర‌స్థావించ‌డ‌మే గాకుండా .. తాను హీరోగా ట్రై చేస్తున్న క్ర‌మంలో త‌న‌ని వెయిటింగులో పెట్టాల‌ని చూసిన ప‌లువురిని ఓ రేంజులో తిట్టేశాడు.

ఆ న‌లుగురు ఎవ‌రు? అంటే రైట‌ర్ కం డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌, అగ్ర‌నిర్మాత దిల్‌రాజు, హీరో శిరీష్‌, వీళ్ల‌తో పాటు వేరొక నిర్మాత‌. అయితే ఆ న‌లుగురిని శంక‌ర్ ఎందుకు ఆడేసుకున్నాడు? అంటే అందుకు కార‌ణం స‌హేతుకం. ఎన్నో ఆక‌లిరేతిరులతో జాగారం చేసి ఇంత సాధించాక కూడా త‌న‌కు ఓ అవ‌కాశం ఇవ్వ‌డానికి ఏకంగా కొంటె షాకులు చెబుతూ రెండు మూడేళ్లు ఆగ‌మ‌న్నార‌ట‌. కేవ‌లం ఆ రీజ‌న్ గుండెల్లో మంట పెట్ట‌డం వ‌ల్ల‌నే నెల్లూరు ర‌మ‌ణారెడ్డి, సురేష్‌ కొండేటిల‌తో క‌లిసి శంభో శంక‌ర సినిమాలో న‌టించాడ‌ట‌. కొంద‌రైతే అత‌డిని నువ్వేమైనా డ‌బ్బు పెడ‌తావా? అని అడిగారు. త్రివిక్ర‌మ్ అయితే.. క‌మెడియ‌న్ల‌లోనే నువ్వు బ‌ల‌మైన క‌మెడియ‌న్‌వి అంటూ హేళ‌న చేశాడ‌ట‌. దిల్‌రాజు రెండేళ్లు ఆగు చేద్దామ‌ని అన్నాడు. వేరొక నిర్మాత అమెరికా వెళ్లి వ‌చ్చి ఒక సినిమా చేశాక చూద్దామ‌న్నార‌ట‌. ఇక అల్లు శిరీష్ అయితే ఇంకా నాకు గీతా ఆర్ట్స్‌ని అర‌వింద్ ఇచ్చేయ‌లేద‌ని వెట‌కార‌మాడార‌ట‌. ఇవ‌న్నీ లైవ్‌లోనే శంక‌ర్ చెప్పేయ‌డ‌మే కాదు చాలా ఎమోష‌న్ అయిపోయాడు. ఓ ర‌కంగా స‌ద‌రు క‌మెడియ‌న్ బ‌ర‌స్ట్ అయిపోయాడు. అయితే శంక‌ర్‌లోని నిజాయితీ, సూటిగా మాట్లాడే త‌త్వం మాత్రం చూప‌రులంద‌రికీ న‌చ్చింది. అత‌డు ఎవ‌రిని టార్గెట్ చేశాడ‌నే దానికంటే ఎంత ధైర్యంగా టార్గెట్ చేశాడు? అన్నది మాత్రం చెప్పుకోద‌గ్గ‌ది. ఇక‌పోతే పైవాళ్లు అంతా కేవ‌లం వారికి ఉన్న ఇత‌ర షెడ్యూల్స్ వ‌ల్ల అలా త‌న‌ని వెయిటింగులో ఉంచార‌ని, ఏదో ఒక‌రోజు అవ‌కాశ‌మిస్తార‌ని శంక‌ర్ త‌న‌దైన శైలిలో క‌వ‌ర్ చేసేశాడు. ఇక‌పోతే ఇండ‌స్ట్రీలో ఆక‌లితో గ‌డిపిన క్ష‌ణాల్ని మ‌ర్చిపోలేన‌ని, మూడేళ్లు హీరో అవ్వ‌డం కోసం చెప్పుల‌రిగేలా తిరిగాన‌ని చెప్పాడు. వంద‌ల‌మంది క‌థ బావుంది అన్న‌వాళ్లే కానీ త‌న‌తో సినిమా చేసేందుకు ఎవ‌రూ ముందుకు రాలేద‌ని చెప్పేశాడు. శంక‌ర్ భ‌గ‌భ‌గ‌.. ఆ శంక‌రుని మ‌ళ్లే!!

User Comments