పందెం పుంజుల‌న్నీ ఇలా చేశాయేం?!

Last Updated on by

సంక్రాంతి పుంజులు ఒక్కొక్క‌టిగా బ‌రిలో దిగుతున్నాయి. పందేనికి క‌త్తి గ‌ట్టి దిగిపోయిన పుంజులు ఇప్ప‌టికే రిజ‌ల్ట్ కూడా అందుకున్నాయి. ఈ పుంజులేవీ వ‌ర్క‌వుట‌య్యే పుంజులు కాదు. పందెం కొట్టే పుంజులు అస‌లే కాదు అని తేల్చేశారు జ‌నం. ప‌ర‌మ రొటీన్ పుంజుల‌కు, విష‌యం లేని పుంజుల‌కు క‌త్తి క‌డితే ఇలాగే ఉంటుంద‌ని పెద‌వి విరిచేస్తున్నారు. ఒక్క పుంజులోనూ వాడి వేడి లేదు. పొగ‌రు వొగ‌రు లేదు! అంటూ తేల్చేశారు. గ‌త ఏడాది `రంగ‌స్థ‌లం` ఇచ్చిన కిక్కు ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజైన ఏ సినిమా ఇవ్వ‌లేద‌న్న‌ది గ్రౌండ్ రిపోర్ట్.
`క‌థానాయ‌కుడు` వ‌చ్చాడు. ఒక సెక్ష‌న్ కే అంకిత‌మ‌య్యాడు. నంద‌మూరి అభిమానులు ఆ భారం మోస్తున్నారు. విన‌య విధేయ రామ వ‌చ్చాడు. సేమ్ రిజ‌ల్ట్. ఈ సినిమా బోయ‌పాటి అభిమానుల‌కు మాత్ర‌మే. ఇక చెర్రీ అభిమానులే నిరాశ‌ప‌డ్డార‌న్న మాట వినిపిస్తోంది. పేట చిత్రంతో ర‌జ‌నీ వ‌చ్చాడు. ర‌జ‌నీ రెయిజ్ అయ్యినా, పేట క‌థ తేలిపోయిందని రిజ‌ల్ట్ తేల్చేశారు. డ‌బ్బింగ్ సినిమాకి థియేట‌ర్లు లేక‌పోవ‌డంతో హ‌రే రామ హ‌రే కీర్త‌న‌లు పాడుతున్నారు. ఇక ఈ పందెంలో మిగిలిన మొన‌గాళ్లెవ‌రు? అంటే.. ఎఫ్ 2 చిత్రంతో రాబోతున్న వెంకీ- వ‌రుణ్ పెండింగ్. అంతేగా అంతేగా! అంటూ ట్రైల‌ర్ తో మెప్పించినా తెలుగు సినిమాలు ఎప్పుడూ ఇంతేగా ఇంతేగా!! అనిపించ‌క‌పోతే నే గుడ్ రిజ‌ల్ట్ సాధ్యం. జ‌న‌వ‌రి 12న అంటే రేపు వేక‌వ‌ఝాము 6 ఏఎంకే మై ఫ‌స్ట్ షోలో రివ్యూ చ‌దివి మీరే ఆ రిజ‌ల్ట్ ఏంటో తెలుసుకోవ‌చ్చు. టిల్ దెన్ వెయిట్..& వాచ్ ఫ‌ర్ మోర్ అప్ డేట్స్ ..

User Comments