సంక్రాంతి పుంజుల ట్రేడ్ రిపోర్ట్

Last Updated on by

సంక్రాంతి సినిమాల్లో ఏ సినిమా స‌న్నివేశం ఏంటి? అంటే.. ఇప్ప‌టికే వెంకీ-వ‌రుణ్ తేజ్ ల `ఎఫ్ 2` హిట్ సినిమా అన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి క్రిటిక్స్ 3.5/5 రేటింగ్ ఇచ్చి ప్ర‌శంసించారు. దీనికి తోడు ఈ సినిమా తెలుగు రాష్ట్రాలు స‌హా అమెరికాలోనూ చ‌క్క‌ని వ‌సూళ్లు సాధిస్తోంద‌న్న రిపోర్ట్ అందింది. ఎఫ్ 2 అమెరికాలో 6కోట్లు (1 మిలియ‌న్ డాల‌ర్‌) వ‌సూలు చేసింది. మ‌రోవైపు చ‌ర‌ణ్ -బోయ‌పాటిల విన‌య విధేయ రామ కి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చాయి. క్రిటిక్స్ ఏకి పారేసినా.. ఈ సినిమా ఈ పండ‌గ సెల‌వుల్ని బాగానే క్యాష్ చేసుకుంటోందిట‌. సెల‌వుల్లో థియేట‌ర్ల కిట‌కిట క‌నిపిస్తోంద‌న్న స‌మాచారం ఉంది.

ర‌జ‌నీకాంత్ పేట చిత్రం ఫ్లాప్ అంటూ టాక్ వినిపించింది. అయితే పండ‌గ సెల‌వులు ఈ సినిమాకి క‌లిసొచ్చాయి. ఇక ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు చిత్రం ఫ‌ర్వాలేద‌న్న టాక్ అందుకున్నా, మాస్ ఆడియెన్ ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డంలో ఈ సినిమా విఫ‌ల‌మైంద‌న్న ప్ర‌చారం సాగుతోంది. చాలా ఏరియాల్లో భారీ ధ‌ర‌ల‌కు అమ్మేయ‌డంతో పంపిణీ వ‌ర్గాల‌కు న‌ష్టాలు త‌ప్పేట్టు లేద‌న్న మాటా వినిపిస్తోంది. ఇక క్రిటిక్స్ ని ఎఫ్ 2 మెప్పించిన చందంగా ఇత‌ర  ఏ సినిమా మెప్పించ‌లేదు. అన్ని సినిమాల‌కు యావ‌రేజ్ రేటింగులే వ‌చ్చాయి. ఓవ‌ర్సీస్ లో ఎఫ్ 2 మిన‌హా అన్ని సినిమాలు తేలిపోయాయ‌న్న మాటా వినిపిస్తోంది.

User Comments