కొర్ర‌పాటిపై సంక్రాంతి పంచ్

Last Updated on by

సంక్రాంతి బ‌రిలో రిలీజైన క‌థానాయ‌కుడు పంచ్ ఓ పంపిణీదారుడిపై తీవ్రంగానే ప‌డింద‌ని తెలుస్తోంది. ఆ సినిమాకి ఆయ‌నే స‌హ‌నిర్మాత కం పంపిణీదారుడు కావ‌డంతో న‌ష్టాలు పెద్ద రేంజులోనే త‌ప్ప‌డం లేద‌న్న మాటా వినిపిస్తోంది. ఆయ‌న ఎవ‌రో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నేలేదు. వారాహిచ‌ల‌న‌చిత్రం అధినేత‌, డిస్ట్రిబ్యూట‌ర్ కం నిర్మాత సాయి కొర్ర‌పాటి. ఈ సంక్రాంతి సంద‌ర్భంగా ఎన్నో ఆశ‌ల‌తో రిలీజ్ చేసిన ఎన్టీఆర్ బ‌యోపిక్ వ‌ల్ల అత‌డికి బిగ్ పంచ్ ప‌డింద‌న్న మాటా వినిపిస్తోంది.

పార్ట్ 1 క‌థానాయ‌కుడు చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నా, బాక్సాఫీస్ వ‌ద్ద రివ‌ర్స‌వ్వ‌డంతో పెద్ద మొత్తంలో న‌ష్టాలు త‌ప్పేట్టు లేవ‌న్న మాట వినిపిస్తోంది. దాదాపు 70 కోట్ల మేర బిజినెస్ చేసిన ఈ చిత్రం ఊహించ‌ని రీతిలో వ‌సూళ్ల వ‌ద్ద ఫెయిలైంది. కొర్ర‌పాటి త‌నే నిర్మాత‌, పంపిణీదారుడు కావ‌డం ఇంత పెద్ద పంచ్ కు కార‌ణ‌మైందిట‌. సీడెడ్, కృష్ణ‌, వైజాగ్‌, క‌ర్ణాట‌క‌లోనూ కొర్ర‌పాటి స్వ‌యంగా రిలీజ్ చేయ‌డంతో ఈ మేర‌కు బిగ్ పంచ్ ప‌డింద‌ని తెలుస్తోంది. బాల‌కృష్ణ రేంజును మించి పెట్టుబ‌డులు పెట్ట‌డం కూడా ఈ పంచ్ కి కార‌ణ‌మ‌న్న మాటా వినిపిస్తోంది. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి, మ‌హానటి రేంజు విజ‌యం ఆశిస్తే అంతా రివ‌ర్స‌య్యింద‌న్న మాటా ప్ర‌ముఖంగా ట్రేడ్ లో చ‌ర్చ‌కొచ్చింది.

User Comments