సంతానం లౌక్యంగా దోచేసాడుగా..!

ఏంటి.. సంతానం దోచేయ‌డం ఏంటి అనుకుంటున్నారా..? అవును.. ఇందులో నిజం లేక‌పోలేదు. ఈయ‌న న‌టిస్తున్న స‌క్క పోడుపోడు రాజా ట్రైల‌ర్ చూస్తుంటే ఇదే అనుమానం వ‌స్తుంది మ‌రి. ఈ చిత్ర క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు నేనే అంటూ సేతురామ‌న్ పోస్ట‌ర్స్ పై వేసుకున్నాడు. కానీ ట్రైల‌ర్ చూస్తే మాత్రం ఇది మ‌న లౌక్యం సినిమాకు ఫ్రీ మేక్ అనే విష‌యం అర్థ‌మైపోతుంది. సీన్స్ కూడా మార్చ‌కుండా దించేసాడు ద‌ర్శ‌కుడు. కానీ ఎక్క‌డా లౌక్యం పేరు వాడ‌టం లేదు సంతానం అండ్ బ్యాచ్. వాళ్లేదో నిజంగానే సొంత సినిమా చేసిన‌ట్లు చెప్పుకుంటున్నారు. మొన్న విడుద‌లైన ఆడియో వేడుక‌లో కూడా ఇది లౌక్యం రీమేక్ అనే విష‌యం చెప్ప‌లేదు. తాము ఈ చిత్రాన్ని కాపీ అన‌కుండా ఇన్ స్పైర్ అయ్యామ‌ని క్లాస్ గా చెబుతున్నారా అనేది ఆస‌క్తిక‌రంగా మారిందిప్పుడు. సంతానంకు హీరోగా తొలి విజ‌యం అందించింది కూడా తెలుగు రీమేకే. మ‌ర్యాద‌రామ‌న్న రీమేక్ వ‌ల్ల‌వ‌నుక్కు పుల్లు ఆయుధంతో అందుకున్నాడు.

ఇక ఇప్పుడు స‌క్క పోడు పోడు రాజా సినిమాలో హీరోగా న‌టిస్తున్నాడు సంతానం. ఈ సినిమాకు శింబు సంగీతం అందించ‌డం విశేషం. ఇందులో సంతానం లుక్ చూసి షాక్ అయిపోక త‌ప్ప‌దు. ఎందుకంటే స్టార్ హీరోల కంటే స్టైల్ గా మారిపోయాడు ఈయ‌న‌. ఈ మ‌ధ్యే స‌క్క పోడుపోడు రాజా ఆడియో విడుద‌లైంది.. అప్ప‌టి వ‌ర‌కు లౌక్యం సినిమా రీమేక్ అనే విష‌యం చెప్ప‌ట్లేదు. ఇప్ప‌టికీ ఈ విష‌యం చెప్ప‌డం లేదు ద‌ర్శ‌క నిర్మాత‌లు. 2014లో వ‌చ్చిన లౌక్యం గోపీచంద్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే సినిమాను త‌న కెరీర్ కోసం వాడేసుకుంటున్నాడు సంతానం. డిసెంబ‌ర్ 22న ఈ చిత్రం విడుద‌ల కానుంది. ఆ రోజు శివ‌కార్తికేయ‌న్ న‌టిస్తున్న వెలైకార‌న్ కూడా వ‌స్తుంది. అయినా కానీ వెన‌క్కి త‌గ్గ కుండా లౌక్యంగా లౌక్యంతో దూరిపోతున్నాడు సంతానం. చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..?

User Comments