Last Updated on by
ప్రఖ్యాత సినీవారపత్రిక `సంతోషం` 17వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా 16వ వార్షికోత్సవం, సంతోషం అవార్డ్స్ వేడుకలు ఆగష్టులో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సౌత్ నాలుగు భాషలకు చెందిన స్టార్లు, టెక్నీషియన్లకు ఈ పురస్కారాల్ని అందించనున్నారు. ఆ మేరకు సంతోషం మ్యాగజైన్ అధినేత, నిర్మాత సురేష్ కొండేటి ఓ ప్రకటనలో వివరాలందించారు.
అవార్డు వేడుకల సందర్భంగా `సంతోషం` అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ -“16ఏళ్లుగా సంతోషం మ్యాగజైన్ నిత్యనూతనంగా పాఠకుల ముందుకు వస్తూనే ఉంది. సినీమ్యాగజైన్ల మనుగడ కష్టంగా ఉన్న నేటిరోజుల్లోనూ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతివారం టంచనుగా పాఠకదేవుళ్లకు మ్యాగజైన్ అందజేస్తున్నాం. సౌతిండియాలోనే సుదీర్ఘ కాలం పాఠకాదరణ పొందుతున్న మ్యాగజైన్గా `సంతోషం` పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ప్రతియేటా ఆగస్టులో సంతోషం అవార్డుల వేడుకను కన్నుల పండువగా నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ఆగస్టులో అంతే వైభవంగా అవార్డుల వేడుకను నిర్వహించనున్నాం. ఈ వేడుకలో సౌత్ నాలుగు భాషల నుంచి ఇండస్ట్రీ బెస్ట్ స్టార్లు, దర్శకనిర్మాతలు, 24 శాఖల ప్రముఖులు విచ్చేయనున్నారు. అవార్డ్స్ వేదికపై ప్రత్యేక కార్యక్రమాలు రంజింపజేస్తాయి“ అని తెలిపారు.
User Comments