స‌ప్త‌గిరి డైరెక్ట‌ర‌హో!

Last Updated on by

వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో స‌ప్త‌గిరి ఫేట్ ఊహించ‌ని ట‌ర్న్ తీసుకుంది. అటుపై స్టార్ క‌మెడియ‌న్‌గా ఎదిగేశాడు. కానీ క‌మెడియ‌న్ నుంచి హీరో అయ్యాక‌నే అస‌లు క‌థ మొద‌లైంది. స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌, స‌ప్త‌గిరి ఎల్ఎల్‌బి అంటూ రెండు సినిమాల్లో హీరోగా న‌టించాడు. ఆ క్ర‌మంలోనే హీరోకి క్యారెక్ట‌ర్లు ఏంటి? అనుకున్న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ముఖం చాటేయ‌డం మొద‌లుపెట్టారు. ప్ర‌స్తుతం స‌ప్త‌గిరి ఎక్క‌డ‌? అని వెతుక్కోవాల్సిన ప‌రిస్థితి.

అయితే కుక్క కాటుకు చెప్పు దెబ్బ మందు అన్న చందంగా స‌ప్త‌గిరి దీనికో విరుగుడు క‌నిపెట్టాడ‌ట‌. అదే ద‌ర్శ‌క‌త్వం. తాను వ‌చ్చిందే ద‌ర్శ‌క‌త్వ శాఖ నుంచి. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా అనుభ‌వం ఘ‌డించాకే న‌టుడ‌య్యాడు. ఆ త‌ర్వాతే హీరో అయ్యాడు. కాబ‌ట్టి తిరిగి త‌న మూలాల్ని వెతుక్కుంటూ వెళ్లి ప్ర‌స్తుతం ఓ స్క్రిప్టు రాసుకున్నాడ‌ట‌. అది నిర్మాత‌ల‌కు వినిపించాడ‌ని, అట్నుంచి గ్రీన్ సిగ్న‌ల్ కోసం వేచి చూస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఇండ‌స్ట్రీలో ఏ అవ‌కాశాన్ని వ‌దిలిపెట్ట‌కూడ‌దు. ఈసారి ద‌ర్శ‌క‌త్వంపైనా స‌ప్త‌గిరి ప‌ట్టుబిగిస్తాడేమో చూడాలి.

User Comments