టీజ‌ర్ టాక్‌: మ‌హేష్ మాస్ కా ద‌మ్

సూపర్ స్టార్ మహేష్ – అనిల్ రావిపూడి కాంబినేషన్ లో అనీల్ సుంక‌ర‌- దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న `సరిలేరు నీకెవ్వరు` సంక్రాంతి బ‌రిలో రిలీజ్ ఫిక్స్ అయిన సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 12 రిలీజ్ సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 1న ట్రైల‌ర్ ట్రీట్ ఇవ్వ‌నున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది.

ఈలోగానే నేటి సాయంత్రం టీజర్ తో అభిమానుల ముందుకు వ‌చ్చింది టీమ్. మ‌హేష్ ఫ్యాన్స్ కి ఈ టీజ‌ర్ ఫుల్ కిక్కిచ్చింద‌నే చెప్పాలి. మ‌హేష్ లుక్ .. వేష‌ధార‌ణ‌.. రావిపూడి టేకింగ్ కి క్లాప్స్ ప‌డుతున్నాయి. ఫ్యాన్స్ ని ఏమాత్రం నిరాశ‌ప‌ర‌చ‌ని ట్రీట్ నిచ్చింది ఈ టీజ‌ర్. మ‌హేష్ మాస్ కా ద‌మ్ అన్న తీరుగా చెల‌రేగాడు. `మీరు ఎవరో మాకు తెలియదు.. అంటూ మొదలైన టీజర్ లో సైనికుల గొప్పదనాన్ని తెలియ‌జెప్పారు. మహేష్ – విజయశాంతి పాత్రల్ని ఇందులో ఎలివేట్ చేశారు. ఇక చివరిలో ప్రకాష్ రాజ్ పంచ్ య‌థావిధిగా ఆక‌ట్టుకుంది. క‌ళ్ల‌ప్ప‌టించి చూసేంత‌గా అద్భుత‌మైన విజువ‌లైజేష‌న్ మైమ‌రిపించింది.

మహేశ్ – రష్మిక మంద‌న జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రొఫెస‌ర్ భార‌తిగా ట్రీటివ్వ‌నున్నారు. ఇందులో త‌మ‌న్నా ప్ర‌త్యేక గీతానికి సంబంధించిన గ్లింప్స్ ని త్వ‌ర‌లోనే రిలీజ్ చేసే వీలుంద‌ని తెలుస్తోంది. ఇక డిసెంబ‌ర్ 31 మిడ్ నైట్ లో అంటే కొత్త సంవ‌త్స‌రానికి వెల్ కం చెబుతూ ట్రైల‌ర్ ట్రీట్ ఉంటుంద‌ట‌.