స‌రిలేరు అమెరికా రైట్స్ ఆ సంస్థ‌కే!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ స‌రిలేరు నీకెవ్వ‌రు షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. వ‌రుస విజయాల‌తో దూకుడు మీదున్న మ‌హేష్ కొత్త సినిమా కూడా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ ఖాయం. తాజాగా ఈ సినిమా ఆమెరికా పంపిణీ హ‌క్కుల‌ను గ్రేట్ ఇండియా ఫిలింస్ ద‌క్కించుకుంద‌ని స‌మాచారం. ఈ న‌యా పంపిణీ సంస్థ మ‌హేష్ సినిమాల పాలిట ల‌క్కీ డిస్ర్టిబ్యూష‌న్ కంపెనీ.

గ‌తంలో అత‌డు, పోకిరి సినిమాల‌ను ఇదే సంస్థ రిలీజ్ చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను అందుకుంది. మ‌ళ్లీ కొంత గ్యాప్ త‌ర్వాత‌ ఈ మ‌ధ్య‌నే భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి చిత్రాల‌ను కూడా ఇదే సంస్థ కంపెనీ రిలీజ్ చేసింది. ఆరెండు కూడా భారీ విజ‌యాలే న‌మోదు చేసాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌రోసారి స‌రిలేరు నీకెవ‌వ్వ‌రు హ‌క్కుల‌ను గ్రేట్ ఇండియా ఫిలింస్ కి ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ నిర్మిస్తోంది. ఈ నిర్మాణ సంస్థ‌ తెర‌కెక్కించిన ప‌లు సినిమాల‌ను గ్రేట్ ఇండియా ఫిలింస్ గ‌తంలోనూ రిలీజ్ చేసింది.