ట్రెండింగ్‌: స‌రిలేరు వ‌ర్సెస్ అల

సంక్రాంతి బ‌రిలో పందెం పుంజుల్లా దిగుతున్నారు మ‌హేష్‌.. బ‌న్ని. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. అల వైకుంఠ‌పుర‌ములో .. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్ర బృందాలు పోటాపోటీగా టీజ‌ర్లు .. లిరికల్ వీడియోల‌తో హీటెక్కిస్తున్నారు.

నేటి సాయంత్రం `సరిలేరు నీకెవ్వరు` చిత్రం నుంచి  `సూర్యుడివో..చంద్రుడివో` అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేశారు. ఈ పాట మెలోడియ‌స్ ట్యూన్. బాణి రొటీన్ గా ఉన్నా.. లిరిక్ ఆక‌ట్టుకుంది. రామ‌జోగయ్య శాస్త్రి క‌లం ప‌దును.. ప్రాక్ గానం అల‌రించాయి. ఈ పాట‌లో మహేష్ బాబు పాత్ర స్వభావం, ఔన్నత్యం తెలిసేలా రామజోగయ్య చ‌క్క‌ని ప‌ద‌జాలం ఉప‌యోగించారు. ఆ లిరిక‌ల్ వీడియో ఇదిగో..

మ‌రోవైపు అల వైకుంఠ‌పుర‌ములో చిత్రానికి సంబంధించిన కొన్ని సెక‌న్ల నిడివితో టీజ‌ర్ ని రిలీజ్ చేసారు. ఈ టీజ‌ర్ లో వైట్ అండ్ బ్లాక్ ఫార్మ‌ల్ ధ‌రించిన బ‌న్ని రెడ్ సూట్ తొడుక్కుంటూ లిఫ్ట్ లోంచి వ‌స్తున్న దృశ్యం ఎంతో ఫ‌న్నీగా ఉంది. ఇక ఆఫీస్ లో బ‌న్ని క్యాట్ వాక్ చూస్తుంటే ఏదో సంథింగ్ స్పెష‌ల్ గా ఉందే అనిపిస్తోంది. కొన్ని సెక‌న్ల నిడివిలోనే ఎంతో మ్యాజిక్ చేశాడు. 11 డిసెంబ‌ర్ సాయంత్రం 4 పీఎం పూర్తి టీజ‌ర్ ట్రీట్ ఉండ‌నుందిట‌. అప్పుడు ఇంకెంత మెరిపిస్తారో. సంక్రాంతి బ‌రిలో జ‌న‌వ‌రి 11న స‌రిలేరు నీకెవ్వ‌రు రిలీజ‌వుతోంది. ఆ మ‌రుస‌టి రోజే అల వైకుంఠ‌పుర‌ములో రిలీజ్ కానుంది. అల‌.. టీజ‌ర్ ఇదిగో..