మే 31 శ‌ర్వా రిలీజ్ క‌న్ఫామ్

యంగ్ హీరో శ‌ర్వానంద్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వ‌రుస క‌మిట్ మెంట్ల‌తో క్ష‌ణం ఖాళీ లేకుండా గ‌డుపుతున్నాడు. కొన్ని ప‌రాజ‌యాలు ఎదురైన‌ప్ప‌టికీ ఆ ప్ర‌భావం శ‌ర్వా మార్కెట్ పై పెద్ద‌గా చూప‌లేదు. ప్ర‌స్తుతం రెండు సినిమాలు సెట్స్ లో ఉన్నాయి. 96 రీమేక్ షూటింగ్ మ‌రో నెల‌రోజుల్లో పూర్తికానున్న నేప‌థ్యంలో తాజాగా సుధీర్ వ‌ర్మ సినిమాఅప్ డేట్ కూడా వ‌చ్చేసింది. 96 రీమేక్ కంటే ముందుగా సుధీర్ వ‌ర్మ చిత్రాన్ని ప‌ట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఇది శ‌ర్వాకి 27వ సినిమా. ఈ సినిమా ఇప్ప‌టికే టాకీ పూర్తిచేసుకుంది. ఇంకా సినిమా కి టైటిల్ ఖారారు చేయ‌లేదు.

ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జ‌రుగుతున్నాయి. తాజాగా మే 31న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు శ‌ర్వానంద్ మేనేజ‌ర్ నుంచి తెలిసింది. సినిమా బాగా వ‌స్తోందని, సుధీర్ వ‌ర్మ విజ‌న్, శ‌ర్వా ఇమేజ్ సినిమాకు క‌లిసొస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు. స‌మ్మర్ బోణీగా `మ‌జిలి`, `జెర్సీ` సినిమాలు నిల‌వ‌గా ఎండిగ్ ని శ‌ర్వా సినిమా అద్భుతంగా ముగిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేసారు. ఇందులో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్ న‌టిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.