శ‌ర్వా టైటిల్ ద‌ళ‌ప‌తి?

Last Updated on by

శ‌ర్వానంద్ – సుధీర్ వ‌ర్మ కాంబినేష‌న్‌లో ఓ క్రేజీ యాక్ష‌న్‌ చిత్రం సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో శ‌ర్వానంద్ డాన్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. యుక్త వ‌య‌స్కుడైన డాన్, ఏజ్ వ‌చ్చిన త‌ర్వాత డాన్ ఇలా రెండు ర‌కాల గెట‌ప్‌ల‌తో అల‌రించ‌నున్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. డాన్ క‌థాంశానికి త‌గ్గ‌ట్టుగానే ఒక మంచి టైటిల్‌ని అనుకున్నార‌ట ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.

`ద‌ళ‌ప‌తి` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసుకున్నార‌ట‌. కానీ ఇదే టైటిల్‌ని వేరొక‌రు ఫిలింఛాంబ‌ర్‌లో రిజిస్ట‌ర్ చేయించ‌డం వ‌ల్ల ఇబ్బందులు త‌లెత్తాయ‌ట‌. అందువ‌ల్ల ఆ టైటిల్ శ‌ర్వాకు ద‌క్కుతుందా .. లేదా అన్న చ‌ర్చ సాగుతోంది. ఒక‌వేళ ఈ టైటిల్ కుద‌ర‌క‌పోయినా `నాయ‌కుడు` అనే వేరొక టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని తెలుస్తోంది. జ‌న‌వ‌రి 1 లేదా డిసెంబ‌ర్‌ 31 రాత్రి కి ఈ టైటిల్‌ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికైతే ద‌ళ‌ప‌తి లేదా నాయ‌కుడు టైటిల్స్ వినిపిస్తున్నాయి. మార్చి లేదా ఏప్రిల్ లో సినిమా రిలీజ‌వుతుందిట‌. ఇంకా టైటిల్ స‌స్పెన్స్ వీడ‌లేదు. శ‌ర్వా టీమ్ లో ఎవ‌రో ఒక‌రు దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Watch :Naga Chaitanya Interview On Savyasachi Stills

User Comments