శ‌ర్వానంద్ 29 శ్రీకారం

Sharwanand Writes Sreekaram For Another Film

యంగ్ హీరో శ‌ర్వానంద్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఒక ప‌క్క సినిమా షూటింగ్ ల‌తో తో బిజీగా ఉంటూనే కొత్త సినిమాలను షురూ చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన ‘రణరంగం’, ‘96’ రీమేక్ చిత్రాల్లో న‌టిస్తున్నాడు. తాజాగా తన 29వ చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. సినిమాకు ‘శ్రీకారం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు ఆదివారం జ‌రిగాయి. స్టార్ దర్శకుడు సుకుమార్ క్లాప్ తో సినిమా ప్రారంభ‌మైంది. ఈ చిత్రానికి కిశోర్‌ రెడ్డి అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అత‌ని వివ‌రాలు ఏంట‌న్న‌ది తెలియాల్సి ఉంది.

దీంతో యంగ్ హీరో మ‌రొకొత్త ద‌ర్శ‌కుడికి అవకాశం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రామ్‌ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఈలోపు ర‌ణ‌రంగం, 96 చిత్రాలు ఓ కొలిక్కా రానున్నాయ‌ని తెలుస్తోంది. కొత్త చిత్రాన్ని 2020 సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంద‌ని యూనిట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.