వేగేష్న ఈసారి `ఆల్ ఈజ్ వెల్`

Last Updated on by

`శ‌త‌మానం భ‌వ‌తి` చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్న‌ దర్శ‌కుడు స‌తీష్ వేగేష్న‌. రైట‌ర్ ట‌ర్న్‌డ్ డైరెక్ట‌ర్ గా తొలి ప్ర‌య‌త్న‌మే చ‌క్క‌ని విజ‌యం అందుకున్నాడు. ర‌చ‌యిత‌గా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న సతీష్ చ‌క్క‌ని ఫ్యామిలీ విలువ‌లు, సెంటిమెంట్ ఉన్న‌ స్క్రిప్టుల్ని మ‌ల‌చ‌డంలో స్పెష‌లిస్ట్. అయితే మ‌లిప్ర‌య‌త్నం ఆశించిన విజ‌యం ద‌క్క‌లేదు. నితిన్ హీరోగా స‌తీష్ వేగేష్న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `శ్రీ‌నివాస క‌ళ్యాణం` బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.

సీనియ‌ర్ ర‌చ‌యిత‌గా స‌తీష్‌కి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉన్న గుర్తింపు మ‌రో చ‌క్క‌ని అవ‌కాశం తెచ్చింద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్టు వ‌ర్క్ పూర్త‌యింది. `ఆల్ ఈజ్ వెల్` అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. త్వ‌ర‌లో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నార‌ట‌. ఈ సినిమాలో హీరో ఎవ‌రు అన్న‌ది ఇంకా క‌న్ఫామ్ కాలేదు. బ్యాన‌ర్ త‌దిత‌ర వివ‌రాల్ని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తార‌ని తెలుస్తోంది. వేగేష్న‌ తొలి రెండు చిత్రాల‌కు చ‌క్క‌ని తెలుగుద‌నం నిండిన‌ టైటిల్స్ ని ఎంపిక చేసుకున్నారు. మూడ‌వ సినిమాకి ఇలా ఓ ఆంగ్ల‌ టైటిల్‌ని ఎంపిక చేసుకోవ‌డానికి కార‌ణ‌మేంటో? ఆల్ ఈజ్ వెల్ అంటూ ఫీల్ గుడ్ సినిమా తీస్తున్నాడా?

User Comments