సావిత్రి స్థాపించిన హైస్కూల్ ఇదే

Last Updated on by

మ‌హాన‌టి` సినిమాకి ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు ప్ర‌జ‌లు నీరాజ‌నాలు ప‌లికారు. ఆ సినిమాలో అమ్మ సావిత్రి వ్య‌క్తిగ‌త జీవితాన్ని క‌నులారా వీక్షించి త‌రించామ‌న్న భావ‌న‌లో ఉన్నారంతా. సావిత్రి ధీరోధాత్త‌త‌, దాణ‌గుణం గురించి తెర‌పై అద్భుతంగా చూపించారు. మ‌హాన‌టి సావిత్రి పేరిట ఓ ట్ర‌స్టును ఏర్పాటు చేసిన సంగ‌తిని తెలిపారు. చివ‌రి రోజుల్లో త‌ను నిర్మించిన సినిమాలతో ఆర్థికంగ న‌ష్ట‌పోయి, ఆదాయ‌ప‌న్ను దాడుల‌తో అయోమ‌యానికి గురైన సావిత్రి ఆ క్రైసిస్ నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఏమీ చేయ‌లేక కుంగిపోతారు. ఆ క్ర‌మంలోనే అయిన వారు మోసం చేసి, ఆదాయ‌ప‌న్ను అధికారుల వేదింపుల‌కు గురై అన్ని ఆస్తుల్ని అమ్ముకోవాల్సి వ‌స్తుంది. అప్పుడు ట్ర‌స్టుకి దాన‌మిచ్చిన సొమ్ముల్ని తిరిగి తీసుకోవాల్సిందిగా అసిస్టెంట్లు చెప్పినా సావిత్రి అందుకు స‌సేమిరా అంటారు.

మ‌రో గొప్ప విష‌యం ఏమంటే.. మ‌హాసాధ్వి సావిత్రి పేరిట ఓ హైస్కూల్‌ని అప్ప‌ట్లో స్థాపించారు. శ్రీ‌మ‌తి సావిత్రి గ‌ణేష‌న్ జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్ (ఎస్ఎస్‌జీహెచ్ హైస్కూల్‌) దీని పేరు. వ‌డ్డివారి పాలెం(రేప‌ల్లె)లో ఈ హైస్కూల్ ఇప్ప‌టికీ ఉంది. స్వ‌గ్రామంలో పేద పిల్ల‌ల చ‌దువుల కోసం సావిత్రి  ఈ స్కూల్‌ని నిర్మించారు. నాడు ప్ర‌భుత్వ‌మే టీచ‌ర్ల‌కు జీతాలివ్వ‌లేక చేతులెత్తేస్తే, ఐదు నెల‌లో జీతంగా స్పాట్‌లో 10,4000 జీతాల‌కు సంబంధించిన చెక్ రాసిచ్చి వెంట‌నే ఉద్యోగుల్ని ఆదుకున్నారు సావిత్రి. 1962లో స్కూల్ స్థాపించారు. 1975లో ప్ర‌భుత్వం జీతాలు చెల్లించ‌లేక‌పోయింది. ఇప్ప‌టికీ ఆ హైస్కూల్‌కి సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. నాడు ల‌క్ష ఇవ్వ‌డం అంటే నేడు 40ల‌క్ష‌లు స‌తిమించ‌డం కిందే లెక్క‌. సావిత్రి అమ్మ ధీర‌త్వం, ఉదార‌గుణం గురించి శాల‌రీలు డ్రా  చేసే ఎస్‌బీఐ బ్యాంకు అధికారి స్వ‌యంగా ఈ వివ‌రాన్ని అందించారు.

User Comments