మ్యాడీకి ల‌వ్‌లెట‌ర్‌

Last Updated on by

మ్యాడీ (ఆర్‌.మాధ‌వ‌న్) సౌత్ సినిమాకే కాదు, అటు బాలీవుడ్‌కి సుప‌రిచితం. ఇంట గెలిచి ర‌చ్చ గెలిచిన హీరో. ర‌చ్చ గెలిచి ఇంట మెప్పు పొందిన హీరో. అత‌డికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులున్నారు. ర‌జ‌నీ, క‌మ‌ల్, సూర్య‌, విజ‌య్‌ల‌ను అభిమానించే ప్ర‌తి ఒక్క ప్రేక్ష‌కుడు మ్యాడీని అభిమానించ‌డం అత‌డి ప్ర‌త్యేక‌త‌. అంతేకాదు తెలుగు ప్రేక్ష‌కుల్లోనూ మ్యాడీని అత‌డి సినిమాలు చూసి, అత‌డి ఎంపిక‌ల్ని చూసి అభిమానించే అసాధార‌ణ ఫాలోవ‌ర్స్ ఉన్నారంటే అతిశ‌యోక్తి కాదు. అలాంటి మేటి ప్ర‌తిభావంతుడిని వ‌లేసి ప‌ట్టింది `స‌వ్య‌సాచి` టీమ్‌. నిన్న‌టితో మాధ‌వ‌న్‌తో షూటింగ్ పూర్త‌యింది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న్ని సాగ‌నంపుతూ చందు మొండేటి & టీమ్ ప్రేమ‌లేఖ‌ను రాయ‌డం ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌..

“డియ‌ర్‌ మ్యాడీ స‌ర్‌.. మీతో ల‌వ్‌లో ప‌డి 17ఏళ్లు పూర్త‌యింది. వీజే గా మొద‌లై, జాతీయ న‌టుడుగా ఎదిగారు. ఈ ప‌య‌నం ఎంతో గొప్ప‌ది. మీ గ్రాఫ్ ఎంతో ఎత్తున ఉంది. అది చూసి ఎంతో స్ఫూర్తి పొందాం. ప‌బ్లిక్‌లో మీరు మాట్లాడే తీరు మాకు ఎంతో ఇష్టం. ద‌ర్శ‌కుడి విజ‌న్‌ని అర్థం చేసుకుని న‌టించే గొప్ప ప్ర‌తిభావంతుడు మీరు. మీతో ప‌ని చేయ‌డం గ‌ర్వ‌కారణం. మీ ముఖ‌విలువ‌తోనే, మా సినిమాకి గుర్తింపు. తెర‌పై క‌నిపిస్తే ఆహ్లాదం.. అంత‌కుమించి సెట్స్‌పై మీ న‌ట‌న వీక్షించ‌డం ఇంకా గొప్ప అనుభూతి. మేమంతా మీకు ఫ్యాన్స్ అయిపోయాం. మీరు తెలుగుకు ప‌రిచ‌యం అవ్వ‌డం ఆల‌స్య‌మైంది. మీ అంగీకారంతోనే మా సినిమా స‌గం స‌క్సెసైంది. తెలుగు ప‌రిశ్ర‌మ‌కు మ‌న‌స్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం“ అని లేఖ‌లో ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

User Comments