చైతూలో ఈ కోణం కూడానా?

అక్కినేని బుల్లోడు నాగ‌చైత‌న్య‌లో ఒక్కో కోణం బ‌య‌ట‌ప‌డుతున్నాయి. జోష్, ఏమాయ చేశావే టైమ్‌కి ఇప్ప‌టికి చైతూని ప‌రిశీలిస్తే ఎంతో ప‌రిణ‌తి క‌నిపిస్తోంది. `ప్రేమ‌మ్` చిత్రంతో అక్కినేని హీరో స్థాయిని చూపించాడు. స‌వ్య‌సాచి త‌న కెరీర్‌లో అంత‌కుమించి బెస్ట్ అవుతుంద‌న్న ధీమాతో ఉన్నాడు. ఈ చిత్రంలో త‌న‌లోని అన్ని కోణాల్ని అంతే కొత్త‌గా ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం జ‌రిగింది. అందుకు సాక్ష్యంగా ట్రైల‌ర్‌లో చైతూ యాక్ష‌న్, డ్యాన్సుల్ని ఎలివేట్ చేశారు. ల‌గా యెత్తు .. పాట‌లో చైతూ డ్యాన్సులు అభిమానుల్ని ఆక‌ట్టుకున్నాయి.

ప్ర‌స్తుతం వేరొక కొత్త కోణాన్ని రివీల్ చేయ‌డం మీడియా స‌హా స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. `సుభ‌ద్ర ప‌రిణ‌యం` అంటూ చైత‌న్య అర్జునిడి గెట‌ప్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి షాకిచ్చాడు. న‌వంబ‌ర్ 2 ఉద‌యం 10 గంట‌ల‌కు అస‌లు ట్విస్టు ఉంది. అస‌లైన స‌వ్య‌సాచిని ఆవిష్క‌రిస్తున్నామ‌ని మైత్రి మూవీస్ టీమ్ ప్ర‌క‌టించింది. చైతూ కిరీటధారియై, శ‌రీరానికి క‌వ‌చం ధ‌రించి.. విల్లంబులు ధ‌రించి .. కొత్త రూపంతో పెద్ద ట్విస్టే ఇచ్చాడు. బ‌హుశా స‌వ్య‌సాచి టైటిల్‌ని జ‌స్టిఫై చేయాలంటే ఇలాంటి ఒక ట్విస్టు త‌ప్ప‌నిస‌రి అని చందు భావించి ఉంటాడు. ఇంత‌కీ సుభ‌ద్ర‌ను వ‌ల‌చే స‌వ్య‌సాచి ట్విస్టేంటో కాస్త వేచి చూడాల్సిందే. న‌వంబ‌ర్ 3న స‌వ్య‌సాచి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది.