స‌వ్య‌సాచి: చేదైన తీపౌతుందోయ్

Last Updated on by

వై నాట్‌!!!… మనకిక్కడ చేదైన తీపౌతుందోయ్…
వై నాట్‌!!!… మనఇద్దరి బాధైనా హాయ్అవుతూందోయ్…

యూత్‌ఫుల్ ట్రెండీ.. క్లాస్సీ.. మ్యూజిక్ తో స‌వ్య‌సాచి సింగిల్ ప‌రిచ‌యం కాస్త‌ కొత్త‌గానే హ‌త్తుకుంటోంది. ముఖ్యంగా ఈ పాట‌లో విజువ‌ల్ రిచ్ లొకేష‌న్లు, యూత్‌ఫుల్ ట్రెండీ బీట్.. నాయకానాయిక‌లు నాగ‌చైత‌న్య‌- నిధి అగ‌ర్వాల్ అప్పియ‌రెన్స్ ఆక‌ట్టుకోనుందని చూపించిన కొద్దిపాటి విజువల్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ యుగ‌ళ‌గీతంలో యూత్‌కి క‌నెక్ట‌య్యే ప‌ద‌జాలం ప్ల‌స్ అనే చెప్పాలి. సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కులు ఎం.ఎం. కీర‌వాణి పూర్తి స్థాయిలో దృష్టి సారించిన చిత్ర‌మిది. కొంత గ్యాప్‌తో వ‌స్తున్న ఆయ‌న ఎంతో క‌సితో సంగీతం అందించార‌ని అర్థ‌మ‌వుతోంది.

 

ప్రేమ‌మ్ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని అందించిన చందు మొండేటి మ‌రో విభిన్న‌మైన క‌థాంశాన్ని ఎంచుకుని, ప్ర‌యోగాత్మ‌క క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా స‌వ్య‌సాచిని తీర్చిదిద్దుతున్నారు. మైత్రి మూవీస్ సంస్థ రాజీ అన్న‌దే లేకుండా భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది. ఆర్. మాధ‌వ‌న్, భూమిక వంటి టాప్ కాస్టింగ్ సినిమాకి పెద్ద ప్ల‌స్ కానున్నారు. శైల‌జారెడ్డి అల్లుడు చిత్రంతో విజ‌యం అందుకున్న చైత‌న్య మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్‌పై క‌న్నేశాడు. అందుకే కాస్త ఆల‌స్యంగా వ‌చ్చినా.. లేటెస్టుగా స‌త్తా చాటాల‌న్న పంతంతో వ‌స్తున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. న‌వంబ‌ర్‌లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ ఫ‌లితం తీపౌతుంద‌నే అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆత్రంగా వేచి చూస్తున్నారు. మ‌రి చై బృందం ఏం చేస్తుందో చూడాలి.

User Comments