ఆమె అక్క‌డ సెటిల్డ్.. పాపం మనోడే..?

తెలుగు ఇండ‌స్ట్రీలోకి తారాజువ్వ‌లా దూసుకొచ్చేద్దాం అని ప్లాన్ చేసుకుని.. ఫ్యూయ‌ల్ అయిపోయిన రాకెట్ లా నేల‌కు దిగిన తార అఖిల్. అక్కినేని బ్యాగ్రౌండ్ అంత‌గా ఉంచుకుని కూడా నాసీర‌కం క‌థ ఒక‌టి తీసుకుని దారుణంగా బోల్తా కొట్టాడు సిసింద్రీ. ఇప్పుడు ఈయ‌న కెరీర్ ఎటూ కాకుండా ఉంది. హ‌లో సినిమా కూడా టాక్ బాగానే వ‌చ్చినా క‌మ‌ర్షియ‌ల్ గా డిజాస్ట‌ర్. దాంతో అఖిల్ కెరీర్ దారితెన్ను లేకుండా పోతుంది. Sayesha Saigal Upcoming Movies Not Signed Second Telugu Movieకానీ ఈయ‌న‌తో పాటే ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన స‌యేషా సైగ‌ల్ మాత్రం త‌న కెరీర్ ను చాలా చ‌క్క‌గా ప్లాన్ చేసుకుంటుంది. ఓ సినిమా ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్ వైపు చూడ్డానికి పెద్ద‌గా ఇష్ట‌ప‌డ‌రు ద‌ర్శ‌క నిర్మాత‌లు. హీరోలు కూడా ఫ్లాప్ హీరోయిన్ ఎందుకు అంటారు. కానీ స‌యేషా సైగ‌ల్ విష‌యంలో మాత్రం అలా జ‌ర‌గ‌డం లేదు. అఖిల్ ఫ్లాప్ త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీ వైపు చూడ్డ‌మే మానేసింది స‌యేషా.Sayesha Saigal Upcoming Movies Not Signed Second Telugu Movieఆ మ‌ధ్య హిందీలో శివాయ్ సినిమాలో న‌టించింది స‌యేషా సైగ‌ల్. ఇక ఇప్పుడు పూర్తిగా త‌మిళ ఇండ‌స్ట్రీకే ప‌రిమితం అయిపోయింది స‌యేషా. అక్క‌డే వాళ్లు చేర‌దీస్తున్నారు ఈ భామ‌ను. ఇప్ప‌టికే అక్క‌డ జ‌యం ర‌వి లాంటి క్రేజీ హీరోతో న‌టించింది స‌యేషా సైగ‌ల్.Sayesha Saigal Upcoming Movies Not Signed Second Telugu Movieప్ర‌స్తుతం నాలుగు సినిమాల‌తో బిజీగా ఉంది స‌యేషా. అవి కూడా చిన్న సినిమాలేం కాదు.. విజ‌య్ సేతుప‌తితో జంగ‌.. ఆర్య‌తో భ‌లే భ‌లే మ‌గాడివోయ్ రీమేక్ గ‌జినీకాంత్.. విజ‌య్- మురుగ‌దాస్ సినిమాలో రెండో హీరోయిన్.. కార్తీ క‌డాయ్ కుట్టి సింగం.. ఇలా చాలా సినిమాల్లో న‌టిస్తుంది అఖిల్ బ్యూటీ. ఇవ‌న్నీ కానీ హిట్టైతే స‌యేషా ద‌శ మారిపోయిన‌ట్లే..! ఆ తర్వాత అయినా మన తెలుగు హీరోలు స‌యేషా వైపు చూస్తారో చూడాలి..!Sayesha Saigal Upcoming Movies Not Signed Second Telugu Movie