ఏజ్ ముదిరినా ఇంకా సూప‌ర్‌స్టారేన‌ట‌!

Last updated on November 13th, 2019 at 09:08 am

స‌ద‌రు సీనియ‌ర్ న‌టి చాలా గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది. అయితే ఇంత గ్యాప్ వ‌చ్చినా త‌న‌లో డాబు ద‌ర్పం ఏమాత్రం త‌గ్గ‌లేద‌ట‌. ఎయిటీస్ లో స్టార్ డ‌మ్ నే ఇంకా కోరుకుంటోంద‌ట‌. త‌న‌కు ఏం కావాల‌న్నా నిరభ్యంత‌రంగానే ఆన్ లొకేష‌న్ డైరెక్ట‌ర్ కి చెప్పేస్తోంది. త‌న‌కి ఏం ఇచ్చేందుకైనా స‌ద‌రు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రెడీగా ఉండ‌డంతో ఆ హీరోయిన్ ఆడిందే ఆట పాడిందే పాట అవుతోంద‌క్క‌డ‌.

అయితే ఆవిడ ఈ ఏజ్ లోనూ ఇంకా సూప‌ర్ స్టార్ ఏంటి? అస‌లు హీరోయిన్ ని కాద‌ని ఆ అద‌న‌పు ఫెసిలిటీస్ ఏమిటో అంటూ సెట్స్ లో అంద‌రూ గొణుక్కుంటున్నార‌ట‌. 50 ప్ల‌స్ ఏజ్ సీనియ‌ర్ న‌టి.. అంత‌ ఏజ్ ముదిరినా అందం ఎక్క‌డా చెద‌రలేదు. ఇటీవ‌లే ఇండ‌స్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది మొద‌లు.. వ‌రుస‌గా పెద్ద హీరోల సినిమాల కోసం వెయిటింగ్ చేస్తోంది. అయితే త‌నో పెద్ద సూప‌ర్ స్టార్ ని అన్న హ్యాంగోవ‌ర్ నుంచి ఇంకా ఆమె బ‌య‌టికి రాలేదు..అగ్ర హీరోల‌కు ధీటుగా తాను కూడా ఇంకా సూప‌ర్ స్టార్ నే అన్న పంతాన్ని విడిచిపెట్ట‌లేదు. ప్ర‌స్తుతం న‌వ‌త‌రం స్టార్లు ఏల్తున్నా.. వారిని లెక్క చేయ‌డం లేద‌ట‌.. ఇంకా నేను సూప‌ర్ స్టార్ నే అప్ప‌ట్లానే! అంటూ భీష్మించుకుని కూచుంటోంద‌ట‌. త‌న స్థాయి గురించి అవ‌త‌లివారికి కాస్త ఎక్కువే క్లాస్ తీస్కొంటోంది. అంత లాంగ్ గ్యాప్ తీసుకుని తిరిగి వ‌చ్చినా బీరాలు పోలేదు.. ప్చ్‌! అంటూ మాట్లాడుకుంటున్నారు.