కుర్ర‌హీరో ప్రేమ‌లో సీనియ‌ర్ భామ‌

Last Updated on by

ఇప్ప‌టికే ఓ అగ్ర‌ హీరోతో ఒక‌సారి ప్రేమ‌లో ప‌డింది. ప్రేమ విఫ‌ల‌మై ఆ త‌ర్వాత‌ పెళ్లి అంటేనే విర‌క్తితో నోనో అంది.. కానీ మ‌ళ్లీ ఇప్పుడు సీను మారింది. కాలంతో పాటే మార్పు! ప్ర‌స్తుతం ఓ కుర్ర‌హీరో అంటే తెగ ఇదైపోతోంది. అత‌డికి ఎస్ చెప్పేందుకు సిద్ధ‌మైంద‌ట‌! ఇంత‌కీ ఎవ‌రీ సీనియ‌ర్ భామ‌?

ప్ర‌స్తుతం స‌ద‌రు భామ ఇటీవ‌లే ఓ సీనియ‌ర్ హీరో స‌ర‌స‌న న‌టించి ఇండ‌స్ట్రీ హిట్ కొట్టింది. ప్ర‌స్తుతం వ‌రుస‌గా మూడు నాలుగు సినిమాల్లో న‌టిస్తోంది. తెలుగులో అగ్ర‌హీరోల స‌ర‌స‌న ఛాన్సులేవీ లేవు కానీ, ఓ కుర్ర‌హీరో స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అలాగే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో న‌టించింది. అది తొంద‌ర్లోనే రిలీజ్‌కి వ‌స్తోంది. ఆ కుర్ర‌హీరోకి కూడా ఈ అమ్మ‌డు అంటే ఎంతో ఇది. త‌న‌పైనా నా తొలి క్ర‌ష్ అంటూ ఓపెన్‌గానే వేదిక‌ల‌పై చెప్పాడు. ఇప్పుడిలా ఏకంగా త‌న‌తోనే న‌టించే ఛాన్సొచ్చినందుకు ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యాడు. ఈ నాలుగు సినిమాల కిడ్ బాగా బాడీ పెంచి అమ్మాయిల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. ప్ర‌తిభ ఉన్నా హిట్టు రాక‌.. ఇబ్బంది ప‌డినా అంద‌రూ స్టార్ హీరోయిన్ల‌తో న‌టిస్తూ చాలానే వైర‌ల్ అవుతున్నాడు. మొత్తానికి సీనియ‌ర్ భామ‌లో కుర్రాడు గుబులు పుట్టించాడ‌న్న‌ది ఇండ‌స్ట్రీ ఇన్‌సైడ్ టాక్. ఈ ఎపిసోడ్‌లో కుర్ర హీరో ఎవ‌రో.. సీనియ‌ర్ బ్యూటీ ఎవ‌రో మీరే గెస్ చేయండిక‌!

User Comments